- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
అక్రమ మట్టి తరలింపులో విషాదం.. టిప్పర్ లారీ దూసుకెళ్లి వ్యక్తి మృతి
by Vemula.Srinu Prasad |
పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలోని నల్లచెరువు వద్ద జరిగిన ప్రమాదంలో ఆవుల నాగార్జున అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌ను పక్కన ఆపి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మట్టి తరలిస్తున్న టిప్పర్ అతనిపై నుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు...

X
దిశ, నకరికల్లు: పల్నాడు జిల్లా నకరికల్లు మండలం కుంకలగుంట గ్రామంలోని నల్లచెరువు వద్ద జరిగిన ప్రమాదంలో ఆవుల నాగార్జున అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్‌ను పక్కన ఆపి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో మట్టి తరలిస్తున్న టిప్పర్ అతనిపై నుంచి వెళ్లడంతో ఘటనాస్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. అక్రమ మట్టి తవ్వకాలపై పలుమార్లు ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని స్థానికులు ఆరోపిస్తూ బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
Next Story






