ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. కారణమిదే..!

by Rajesh |
ట్రాఫిక్ కానిస్టేబుల్‌కు సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు.. కారణమిదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: యూపీఎస్సీ ప్రిలిమ్స్‌కు వెళ్తున్న ఓ యువతిని పరీక్ష కేంద్రానికి తరలించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్‌ను తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించిన ముఖ్యమంత్రి.. వాహనాల నియంత్రణ మాత్రమే తన డ్యూటీ అనుకోకుండా.. సాటి మనిషి సాయం చేయడం తన బాధ్యత అని భావించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సురేష్‌కు అభినందనలు.. సురేష్ సహకారంతో సమయానికి పరీక్షా కేంద్రానికి చేరుకున్న సోదరి యూపీఎస్సీ పరీక్షలో విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నాను.. ఆల్ ది బెస్ట్ అని సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు.Next Story

Most Viewed