దత్తత మున్సిపాలిటీకి అభివృద్ధిలో దశను మారుస్తున్న: ఎమ్మేల్యే శేఖర్ రెడ్డి

by Disha Web Desk 6 |
దత్తత మున్సిపాలిటీకి అభివృద్ధిలో  దశను మారుస్తున్న: ఎమ్మేల్యే  శేఖర్ రెడ్డి
X

దిశ, భూదాన్ పోచంపల్లి: చేనేత పట్టుచీరల్లో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన భూదాన్ పోచంపల్లి పురపాలకగా ఏర్పడిన నాడే" నేను ఈ పట్టణాన్ని దత్తత తీసుకుంటున్నాను. ది బెస్ట్ పోచంపల్లిగా మారుస్తానని ప్రకటించిన ఎమ్మెల్యే పైళ్ళ శేఖర్ రెడ్డి, నేడు ఆనాటి హామీని నిలబెట్టకొని నిధుల వరదను పారిస్తున్నారని ఎంపీపీ మాడుగుల ప్రభాకర్ రెడ్డి అన్నారు. గురువారం పట్టణంలోని వినోబా మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గ, మండల, మున్సిపాలిటీ వ్యాప్తంగా ఎమ్మేల్యే చిత్త శుద్ధితో పలు అభివృద్ధి పనులు శరవేగంగా పూర్తి చేసేందుకు అంకిత భావంతో, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. మున్సిపాలిటీగా ఏర్పడ్డ మూడు సంవత్సరాలకే రూ.39.11 కోట్ల నిధులను మంజూరు చేసిన ఘనత ఆయనకే చెల్లిందని, మున్సిపాలిటీని ఆన్ని రంగాలలో అభివృద్ధికి సహాయం అందిస్తూ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారని కొనియాడారు. మరీ ముఖ్యంగా గురువారం మిగిలిన పలు అభివృద్ధి పనులకు టియుఎఫ్ఐడిసి ద్వారా రూ.6.50 కోట్ల నిధులు మంజూరు చేసేందుకు ఆమోదం లభించినందుకు సమేశంలో పాల్గొన్న అందరూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ చిట్టి పోలు విజయలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రపోజల్ పంపిన వెంటనే 6 కోట్ల 50 లక్షల రూపాయల నిధులను మంజూరు చేయడమంటే ఎమ్మెల్యేకు మన పట్టణం మీద ఎంత ప్రేమ ఉందో అర్థం చేసుకోవచ్చని ఆమె అన్నారు. మున్సిపాలిటీ ఏర్పడినప్పటి నుంచి అడిగిన వెంటనే నిధులను కేటాయిస్తూ పట్టణాన్ని అభివృద్ధి చేసేందుకు నిత్యం కృషి చేస్తున్నారని. మన ప్రాంత ప్రజల పట్ల ఆయనకు ఎనలేని ప్రేమ అభిమానాలతో పాటు ఈ ప్రాంతాన్ని ఆదర్శ నగరంగా తీర్చిదిద్దాలని సంకల్పంతో ఆయన పని చేస్తున్నారని ఆమె పునరుద్ఘాటించారు. త్వరలో మినీ ట్యాంక్ బండ్ పెద్ద చెరువు కట్ట రోడ్డు పనులు కూడా మొదలవుతాయని ఆమె చెప్పారు. దాదాపు రూ 40 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి శరవేగంగా పూర్తి చేసి 100% సిసి రోడ్లు ,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేసుకోవడం దత్తత గ్రామాన్ని అభివృద్ధిలో దశను మార్చిన గొప్ప మనసు ఆయనదని చాలా గర్వంగా ఉందని ఎమ్మెల్యేకు ఆమే ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎం.పి.పి. మాడుగుల ప్రభాకర్ రెడ్డి, వైస్ చైర్మన్ బాత్క లింగస్వామి, కౌన్సిలర్లు కొంగరి కృష్ణ, పెద్దల చక్రపాణి, కర్నాటి రవి, గుండు మధు, మోటే రజిత, కుడికాల అఖిల, దేవరాయ కుమార్, కో-ఆప్షన్ సభ్యులు జల్డి నర్సింహ, కమీషనర్ భాస్కర్ రెడ్డి,బారాస టౌన్ ప్రెసిడెంట్ సీత వెంకటేశం,కార్యదర్శి గునిగంటి మల్లేశం, జిబ్లక్ పల్లి ఉప సర్పంచ్ అర్ల లింగ స్వామీ మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Next Story