హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఇంట్లో ఏసీబీ సోదాలు..

by Aamani |
హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ  ఇంట్లో ఏసీబీ సోదాలు..
X

దిశ, హిమాయత్ నగర్ : ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలపై హైదరాబాద్ సీసీఎస్ ఏసీపీ ఉమామహేశ్వరరావు ఇళ్లలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. 14 గంటలుగా 14 చోట్ల ఏసీబీ అధికారులు సోదాలు చేశారు. అశోక్ నగర్ లో ఉన్న ఆయన నివాసం లోని అపార్ట్మెంట్ లో ఫ్లాట్స్ 201, 305, 504, సీసీఎస్ కార్యాలయం, నగరంలోని మరో ఇద్దరు స్నేహితుల ఇళ్లు, ఆంధ్రప్రదేశ్ లో నాలుగు చోట్ల సోదాలు ముగిసాయి. అనంతరం విలేకరులతో ఏసీబీ జేడీ వైవీఎస్ సుధీంద్ర మాట్లాడుతూ.. ఉమామహేశ్వరరావు 17 ప్రాపర్టీస్ కొన్నారని వాటిని సీజ్ చేసామని, 5 ఘట్కేసర్ లో , 7 వైజాగ్ చోడవరం భూములు కొన్నాడని ఏసీబీ జేడీ సుధీంద్ర తెలిపారు. హైదరాబాద్ అశోక్ నగర్ లో 4 ఫ్లాట్స్ గుర్తించమని ఆయన పేర్కొన్నారు.

శామీర్ పేట్ లో 1, కూకట్ పల్లి 1 మల్కాజిగిరి 1 భూములు కొన్నారని ఆయన వివరించారు. సోదాల్లో 38 లక్షల నగదు.. 60 తులాల బంగారం సీజ్ చేశామని,రూ. 3 కోట్ల 50 లక్షలు విలువ చేసే ఆస్తులు సీజ్ చేశామని బహిరంగ మార్కెట్లో వీటి విలువ చెప్పలేమన్నారు. ఉమామహేశ్వరరావు పై గతంలో కొన్ని కేసులో అభియోగాలు ఉన్నాయని, 2 బ్యాంక్ లాకర్ గుర్తించామని.. ఉమామహేశ్వరరావు డైరీలో సందీప్ అని పేరు ఉందని, సందీప్ రావు తో పెట్టుబడులు పెట్టాడా అతని ఎవరు దర్యాప్తులో చేస్తామని ఆయన వెల్లడించారు. ఇబ్రహీంపట్నం ఏసీపీ గా పనిచేసిన సమయంలో అక్రమార్జనతో భారీగా ఆస్తులు కూడబెట్టారని ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. సాహితీ ఇన్ఫ్రా కేసుల విచారణ అధికారిగా వ్యవహరించారు. ఈ స్కామ్ లో పెద్ద ఎత్తున డబ్బులు దండుకున్నారు. అలాగే ఇబ్రహీంపట్నం రియల్ ఎస్టేట్ డబల్ మర్డర్ కేసులో డబ్బులు తీసుకున్నాడని ఉమామహేశ్వర రావు పై ఆరోపణలు రావడంతో ఉమామహేశ్వరరావు ను అప్పటి సీపీ సస్పెండ్ చేశారు.రూ. 1000 కోట్ల ఎఫ్ఎంసీజీ ఫార్మా స్కాంలో రూ. 5 కోట్ల ముడుపులు అందుకని విమర్శలు ఎదుర్కొన్నాడు. మరోవైపు ప్రస్తుతం పనిచేస్తున్న సీసీఎస్ లో పలు కేసుల్లో ముడుపులు తీసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Next Story

Most Viewed