స్వాతి మలివాల్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మద్దతు

by Shamantha N |
స్వాతి మలివాల్ కు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ మద్దతు
X

దిశ, నేషనల్ బ్యూరో: ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్‌కు మద్దతుగా నిలిచారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా.ఈ దాడి ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైనట్లు తెలిపారు. స్వాతికి ఎదురైన అవనామానాలు చూసి ఆవేదన చెందినట్లు తెలిపారు. సీఎం కేజ్రీవాల్ తీరుని ఆయన తప్పుపట్టారు. కేజ్రీవాల్ స్పందించకపోవడాన్ని ప్రశ్నించారు. స్వాతిని శారీరక హింసకు గురిచేయడం దారుణం అని అన్నారు. సహచర నేతల నుంచి ఎదురైన బెదిరింపులు క్షమించరాని నేరమని పేర్కొన్నారు.

ఇకపోకే, ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వ్యాఖ్యలను ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. మలివాల్ బీజేపీకోసం పనిచేస్తున్నట్లు ఎల్జీ లేఖ ద్వారా రుజువైందని తెలిపింది ఆప్. ఢిల్లీ మంత్రి అతిషి కూడా ఇటీవల మీడియాతో మాట్లాడుతూ.. స్వాతి మలివాల్.. బీజేపీ ఏజెంట్‌గా మారారని పేర్కొన్నారు. ఇక ఈ ఘటనపై కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కూడా తీవ్రంగా తప్పుపట్టారు. కేజ్రీవాల్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.

మే 13న కేజ్రీవాల్ నివాసంలో స్వాతి మలివాల్‌పై కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్‌ దాడి చేశారు. ఆమెను శారీరకంగా హింసించినట్లు స్వాతి ఆరోపించారు. ఎట్టకేలకు ఘటన జరిగిన నాలుగు రోజులకు పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. నిందితుడు బిభవ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.

Next Story

Most Viewed