- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మోడీ మార్క్ పాలిటిక్స్.. తెలంగాణ గడ్డపై చంద్రబాబు, పవన్‍తో మోడీ భేటీపై సర్వత్రా ఆసక్తి
హైదరాబాద్ వేదికగా చంద్రబాబు, పవన్‌లతో ప్రధాని మోదీ భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రధాని నరేంద్ర మోడీ (PM Narendra Modi) తెలంగాణ రాష్ట్ర పర్యటన రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్రానికి వచ్చిన మోడీ.. హైదరాబాద్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‍ను (Pawan Kalyan) కలవడం చర్చనీయాశంగా మారింది. ఇటీవల శస్త్ర చికిత్స చేయించుకుని విశ్రాంతి తీసుకుంటున్న పవన్ కళ్యాణ్‍ను పరామర్శించిన మోడీ అనంతరం నేరుగా చంద్రబాబు నివాసానికి వెళ్లారు. అక్కడ దాదాపు గంటపాటు తాజా రాజకీయ పరిస్థితులపై మోడీ, చంద్రబాబు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే తెలంగాణలో బహిరంగ సభకు మందు చంద్రబాబుతో భేటీ కావడం వెనుక మోడీ వ్యూహం ఏంటనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది.
మోడీ మార్క్ పాలిటిక్స్:
ప్రధాని మోడీ రాజకీయ వ్యూహాలు అంత సులభంగా అంతుచిక్కవనే టాక్ ఉంది. ఎక్కడో రిజల్ట్ కోసం మరెక్కడో స్కెచ్ వేస్తారనే అభిప్రాయం ఉంది. అలాంటిది ఏపీ నేతలతో తెలంగాణ గడ్డపై మోడీ భేటీ కావడం వెనుక మతలబు ఏంటి అనే చర్చ తెరమీదకు వస్తోంది. త్వరలో జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ జెండాను రెపరెపలాడించాలని బీజేపీ శ్రేణులు ఉత్సాహంతో ఉన్నాయి. ఈ లక్ష్య సాధనకు మోడీ సభను ఆయుధంగా వాడుకోవాలని పార్టీ భావిస్తోంది. ఇటువంటి తరుణంలో మోడీ ఏకంగా చంద్రబాబుతో సుదీర్ఘంగా భేటీ కావడం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా ఉన్నప్పటికీ అదే కూటమి ప్రయోగం విషయంలో తెలంగాణ బీజేపీ వెనకాముందు ఆలోచిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో మోడీ ఆలోచన ఏంటనేది రెండు తెలుగు రాష్ట్రాల్లో సస్పెన్స్ గా మారింది.
మిషన్ సౌత్?:
చంద్రబాబుతో మోడీ భేటీ వెనుక సౌత్ ఇండియాలో ఎన్డీయే కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యమా అనే అభిప్రాయులు వ్యక్తం అవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‍లో ఎన్డీయే కూటమినే అధికారంలో ఉండగా త్వరలో తెలంగాణలోనూ బలోపేతం కావడాని ఇక్కడి బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఇందుకోసం బీజేపీ కేంద్ర నాయత్వం నేరుగా జోక్యం చేసుకోవాలనే అభిప్రాయాలు క్యాడర్ నుంచి బలంగా వినిపిస్తోంది. ఇటువంటి తరుణంలో నరేంద్ర మోడీ చంద్రబాబుతో భేటీ కావడం ద్వారా తెలంగాణతో పాటు మొత్తం సౌత్ ఇండియా విషయంలో మోడీ బిగ్ స్కెచ్ వేశారనే చర్చ జరుగుతోంది. ఇవాళ్టి మోడీ పర్యటన భవిష్యత్ లో తెలంగాణ గడ్డపై రాజకీయంగా ఎలాంటి పరిణామాలకు కారణం కాబోతోందో అనేది కాలమే సమాధానం చెప్పనుంది.






