హైదరాబాద్‌లో సీఎం చంద్రబాబుతో ప్రధాని మోడీ భేటీ.. కీలక అంశాలపై చర్చ

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-05-10 12:29:53  IST  )

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విచ్చేశారు. ..

హైదరాబాద్‌లో  సీఎం చంద్రబాబుతో ప్రధాని మోడీ భేటీ.. కీలక అంశాలపై చర్చ
X

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు(Andhra Pradesh Chief Minsiter Nara Chandrababu Naidu) నివాసానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ(Prime Minister Narendra Modi) విచ్చేశారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీకి చంద్రబాబు నాయుడు సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు సుదీర్ఘంగా సమావేశమై, ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వ పాలన, ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం.

కీలక అంశాలపై చర్చ

ముఖ్యంగా తెలంగాణలో నెలకొన్న తాజా పరిణామాలతో పాటు, అక్కడ బీజేపీని బలోపేతం చేసే దిశగా అధిష్టానం ఆలోచనలపై వీరిద్దరి మధ్య చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణ రాజకీయాలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిన తరుణంలో, తెలుగు రాష్ట్రాలకు చెందిన కీలక అంశాల నేపథ్యంలో ఈ భేటీ అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

Read More.. పవన్‌ను కలిసిన ప్రధాని.. ఆరోగ్యం ఎలా ఉందంటూ పరామర్శ

Next Story