Breaking: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. వాహనదారుల ఇక్కట్లు!

by Ramesh Naini |

హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది.

Breaking: హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం.. వాహనదారుల ఇక్కట్లు!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ నగరంలో శనివారం సాయంత్రం వాతావరణం ఒక్కసారిగా మారింది. నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. మియాపూర్‌, కూకట్‌పల్లి, చందానగర్‌, మాదాపూర్‌, గచ్చిబౌలి తదితర ఏరియాల్లో వరుణుడు దంచికొట్టాడు. ముఖ్యంగా మియాపూర్, లింగంపల్లి, పటాన్‌చెరు పరిసరాల్లో భారీ కురుస్తుండటంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొన్నారు. దీంతో అప్రమత్తమైన ట్రాఫిక్ పోలీసులు వానలోనే ట్రాఫిక్‌ను క్లియర్ చేసే పనిలో నిమగ్నమయ్యారు.

Next Story