జగిత్యాలలో నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్

by Kodari Anjali |

ప్రభుత్వం నిషేధించిన ఈ-సిగరెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు.

జగిత్యాలలో నిషేధిత ఈ-సిగరెట్ల విక్రయం.. ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
X

దిశ, జగిత్యాల టౌన్: ప్రభుత్వం నిషేధించిన ఈ-సిగరెట్లను అక్రమంగా విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను జగిత్యాల టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.27,500 విలువైన 11 ఈ-సిగరెట్ బాక్సులను స్వాధీనం చేసుకున్నారు. ​పోలీసుల కథనం ప్రకారం... జగిత్యాల పట్టణంలోని చింతకుంట చెరువు ప్రాంతంలో ఈ-సిగరెట్లు విక్రయిస్తున్నట్లు అందిన నమ్మకమైన సమాచారంతో ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు, సీసీఎస్ బృందం, టౌన్ ఎస్‌ఐ ఎం. సుప్రియ సంయుక్తంగా పంచుల సమక్షంలో తనిఖీలు నిర్వహించారు. ఈ ఈ తనిఖీల్లో భాగంగా పురానిపేటకు చెందిన మహమ్మద్ అబ్దుల్ వహీద్ జమీల్ (55), ఇస్లాంపూర్‌కు చెందిన మహమ్మద్ ఫహద్ (26)లను అదుపులోకి తీసుకొని విచారించగా, తాము ఈ-సిగరెట్లను విక్రయిస్తున్నట్లు నిందితులు అంగీకరించడంతో వారిని అరెస్ట్ చేసి, కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు టౌన్ ఇన్‌స్పెక్టర్ పి. కరుణాకర్ తెలిపారు. అలాగే ఈ-సిగరెట్ల కొనుగోలు, విక్రయం, నిల్వ లేదా రవాణా చేయడం చట్టరీత్యా నేరమని.. ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్-100కు లేదా స్థానిక పోలీసులకు తెలపాలని పోలీసులు కోరారు.

Next Story