- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
BRS : కవిత సస్పెండ్ ఎఫెక్ట్.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో పోస్టర్లు, బ్యానర్ల తొలగింపు..
బీఆర్ఎస్ పార్టీ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత సస్పెన్షన్‌తో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ (BRS) పార్టీ నుంచి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) సస్పెన్షన్‌తో రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకల విషయంలో మాజీ మంత్రి హరీశ్‌రావుపై కవిత చేసిన కామెంట్స్ వల్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సీరియస్ అయ్యారు. మరోవైపు పార్టీ శ్రేణులు సైతం ఆగ్రహంగా ఉన్నాయి. తాజాగా పార్టీ నుంచి కవిత సస్పెండ్ చేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల్లో కవిత పోస్టర్లు, బ్యానర్లను పార్టీ శ్రేణులు తీసేస్తున్నారు.
ఇప్పటికే ఆమె ఎక్స్, ఇన్‌స్టాగ్రామ్, ఫెస్‌బుక్ పేజీలను శ్రేణులు అన్‌ఫాలో చేశాయి. తాజాగా కవిత ఫ్లెక్సీని బీఆర్ఎస్ శ్రేణులు దహనం చేశారు. మంగళవారం హుస్నాబాద్ మల్లె చెట్టు చౌరస్తాలో బీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. హరీశ్ రావు పై కవిత చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె ఫ్లెక్సీని పార్టీ నాయకులు దహనం చేశారు. కవిత బీజేపీ నాయకులకు అమ్ముడు పోయినట్లు వ్యవహరిస్తుందని ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ నాయకులను కించపరిచే ప్రయత్నాలను సహించబోమని హెచ్చరించారు. కాగా, పార్టీ నుంచి కవిత సస్పెండ్‌ను పార్టీ శ్రేణులు స్వాగతించాయి.
Read More..
కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ నుంచి MLC కవిత సస్పెండ్?
Kavitha: ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా!.. పార్టీ వేటు నేపథ్యంలో కీలక నిర్ణయం?






