అక్రమ పట్టాలను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా

by Ratna Kumari |

ప్రభుత్వ అసైన్‌మెంట్ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న వారిపై చర్యలు తీసుకుని ఆ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం లింగంపేట మండలంలోని రాంపల్లి గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.

అక్రమ పట్టాలను రద్దు చేయాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట గ్రామస్తుల ధర్నా
X

దిశ, లింగంపేట : ప్రభుత్వ అసైన్‌మెంట్ భూములను అక్రమంగా పట్టాలు చేసుకున్న వారిపై చర్యలు తీసుకుని ఆ పట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ శనివారం లింగంపేట మండలంలోని రాంపల్లి గ్రామస్తులు స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. గ్రామస్తుల కథనం ప్రకారం.. రాంపల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 482లో 36 ఎకరాల ప్రభుత్వ అసైన్‌మెంట్ భూమి ఉండగా, లింగంపేట, ఐలాపూర్ గ్రామాలకు చెందిన కొందరు వ్యక్తులు అందులో సుమారు 20 ఎకరాలకు అక్రమంగా పట్టాలు పొందినట్లు ఆరోపించారు.

అంతేకాకుండా అసైన్‌మెంట్ భూమిలో ఉన్న బురుజుగుట్టను కొందరు ఆక్రమించేందుకు అక్రమ తవ్వకాలు చేపడుతున్నారని, వెంటనే వాటిని నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంపై సమగ్ర విచారణ నిర్వహించి అక్రమ పట్టాలను రద్దు చేయడంతో పాటు భూమిని ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావాలని తహసీల్దార్ సురేష్ కు వినతిపత్రం అందజేశారు. ఈ ధర్నాలో గ్రామ సర్పంచ్ స్వరూప, ఉపసర్పంచ్ సుభాష్ తో పాటు సుమారు 40 మంది గ్రామస్తులు పాల్గొన్నారు.

Next Story