- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ నుంచి MLC కవిత సస్పెండ్?
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు బీఆర్ఎస్(BRS) అధిష్టానం భారీ షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha)కు బీఆర్ఎస్(BRS) అధిష్టానం భారీ షాకిచ్చినట్లు తెలుస్తున్నది. హరీష్ రావు(Harish Rao), సంతోష్ రావు(Santosh Rao) సహా పార్టీ నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆగ్రహంతో వేటు వేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై కాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది.
కాగా, నిన్న కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాళేశ్వరం అవినీతిలో హరీష్ రావు, సంతోష్ రావుదే కీలక పాత్ర అని ఆరోపించారు. వారి అవినీతి మరక నా త్రండి కేసీఆర్‌కు అంటుకున్నదని మండిపడ్డారు. కాళేశ్వరంలో జరిగిన అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వయిరీ వేస్తున్నట్లు ప్రకటించిన నాటి నుంచి నా కడుపు మండిపోతోందని అన్నారు. ఎవరో చేసిన తప్పులకు నా తండ్రి చిక్కుల్లో పడ్డారని సీరియస్ అయ్యారు. మాజీ ఎంపీ సంతోష్, హరీశ్‌రావు వల్లే కేసీఆర్‌కు చెడ్డపేరు వచ్చిందన్నారు.
అంతేకాదు గతంలోనూ ఆమె కేసీఆర్‌కు రాసిన లేఖ లీక్ విషయంలోనూ హాట్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నాయని మాట్లాడారు. మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపైన కూడా లిల్లీఫుట్ అంటూ విమర్శలు చేశారు. వరంగల్‌లో కేసీఆర్ నిర్వహించిన రజతోత్సవ సభ నుంచి కవిత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటు, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుకుంటూ వస్తున్నారు. దీంతో ఎట్టకేలకు ఇవాళ అధిష్టానం వేటు వేసింది.
Read More..
అనుకున్నదే అయ్యింది.. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్
Kavitha: కవిత ఆరోపణలు.. హరీశ్ కు జై.. సంతోష్ పై పార్టీ సైలెన్స్!.. ఎర్రవల్లిలో ఏం జరుగుతోంది?






