- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Kavitha: కవిత ఆరోపణలు.. హరీశ్ కు జై.. సంతోష్ పై పార్టీ సైలెన్స్!.. ఎర్రవల్లిలో ఏం జరుగుతోంది?
కవిత ఆరోపణలు బీఆర్ఎస్ పార్టీలో దుమారం రేపుతున్నాయి.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో కల్వకుంట్ల ఫ్యామిలీ పాలిటిక్స్ దుమారం రేపుతోంది. కేసీఆర్ కు అవినీతి మరక అంటడానికి మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ రాజ్యసభ సభ్యుడు సంతోష్ రావే కారణం అంటూ కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత (Kavitha) చేసిన కామెంట్స్ బీఆర్ఎస్ పార్టీలో (BRS) బిగ్ బ్లాస్టింగ్ గా మారింది. సొంత పార్టీ నేతలపై ఆమె చేసిన వ్యాఖ్యలపై గంటల వ్యవధిలోనే బీఆర్ఎస్ సోషల్ మీడియా హరీశ్ రావుకు బాసటగా నిలిచింది. కేటీఆర్ సైతం తన బావకే మద్దతు తెలపడంతో సిట్యుయేషన్ ను మరింత ఇంట్రెస్టింగ్ గా మార్చింది. సొంత పార్టీ నేతలపై పరోక్షంగా కౌంటర్లు ఇచ్చినా కవిత విషయంలో తీసుకునే చర్యలేంటో అనేది అందరిలో ఉత్కంఠ రేపుతోంది. కవిత ఈ ఆరోపణలు చేసిన వెంటనే హుటాహుటీన కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్ హౌస్ పార్టీ ముఖ్య నేతలతో భేటీ అయ్యారు. అర్ధరాత్రి వరకు ఈ చర్చలు జరిగాయి. కవిత విషయంలో సంచలన నిర్ణయం ఉండబోతున్నదని అంతా ప్రచారం జరిగినా అటువంటి ప్రకటనలేవి ఇప్పటి వరకు రాకపోవడంతో కేసీఆర్ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
అందరి చూపులు ఎర్రవల్లి వైపే:
కవిత వ్యాఖ్యలతో ఇన్నాళ్లు నివురుగప్పిన నిప్పులా మారిన అంతర్గత వ్యవహారం ఒక్కసారిగా బ్లాస్ట్ అయింది. ఇప్పటికే సొంత పార్టీ నేతలపై కవిత క్రమంగా డోస్ పెంచుతూ వచ్చారు. ఇప్పుడు ఏకంగా మాజీ మంత్రి హరీశ్ రావు, కేసీఆర్ కు అత్యంత సన్నిహితంగా ఉండే సంతోష్ రావుపైనే ఆరోపణలు చేయడంతో ఆ అవినీతి కేసీఆర్ కు తెలియకుండా జరిగిందా? ఇన్నాళ్లు ఈ విషయంపై ఎందుకు మాట్లాడలేదంటూ ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేసీఆర్ ఎర్రవల్లి వేదికగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? ఆ నిర్ణయంతో కవిత రాజకీయంగా ఎలాంటి స్టెప్ వేయబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది.
సోషల్ మీడియాలో వార్:
కవిత వ్యాఖ్యలు బీఆర్ఎస్ శ్రేణుల్లో చీలికకు కారణం అయిందనే చర్చ జరుగుతోంది. కొంత మంది కవితకు మద్దతు తెలుపుతుండగా మరి కొందరు కవితపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. గత కొంత కాలంగా కవిత విషయంలో ఎటు తేల్చుకోలేక పోతున్న ద్వితియ శ్రేణి నాయకులు ఇప్పుడు పూర్తి స్థాయిలో కన్ఫ్యూజన్ లో పడిపోయినట్లు తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకు కవిత వర్సెస్ కేటీఆర్ అని అంతా ప్రచారం జరిగినా ఇప్పుడు సీన్ లోకి హరీశ్ రావు పేరు రావడం హరీశ్ రావుకు పార్టీలో పెద్ద ఎత్తున పరిచయాలు, అనుబంధం ఉండటంతో పార్టీ క్యాడర్ మరింత అయోమయంలో పడిపోయినట్లు తెలుస్తోంది. నిన్నా మొన్నటి వరకు కవితతో ఫోటో దిగేందుకు ఆరాటపడిన నేతలు ఇప్పుడు ఆమెనే విమర్శిస్తున్నారని కవిత మద్దతు దారులు ప్రశ్నిస్తుంటే కవిత రాజకీయాల్లోకి రాకముందు నుంచే కేసీఆర్ వెంట హరీశ్ రావు ఉన్నారంటూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజా పరిణామాలపై ఇక నాన్చుడు వద్దని త్వరగా ఏదో ఒకటి తేల్చాలని పార్టీ క్యాడర్ కోరుతోంది. ఇప్పటికే ఈటల రాజేందర్ విషయంలో ఒక రకంగా సొంత కూతురు విషయంలో మరొక రకంగా వ్యవహరిస్తున్నారని కేసీఆర్ ను ప్రత్యర్థులు టార్గెట్ చేస్తున్నారు. కవిత విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
సంతోష్ రావు విషయంలో సైలెన్స్!
కవిత వ్యాఖ్యల నేపథ్యంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా స్పందించిన తీరు ఇంట్రెస్టింగ్ గా మారింది. బీఆర్ఎస్ పార్టీ, కేటీఆర్ ట్వీట్ లో హరీశ్ రావుకు బాసటగా నిలిచారు. కానీ కవిత ఆరోపించిన మరో వ్యక్తి సంతోష్ రావు విషయంలో ఎవరూ ట్వీట్ చేయకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చగా మారింది. కేసీఆర్ కు వెన్నంటి ఉండే సంతోష్ రావుపై ప్రత్యర్థులు చాలా కాలంగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు హరీశ్, సంతోష్ ఇద్దరి పేర్లను కవిత ప్రస్తావించారు. పార్టీ మాత్రం కేవలం హరీశ్ రావుకు సపోర్టుగా స్పందించగా సంతోష్ రావు విషయంలో మౌనం వహించడం చర్చనీయాశంగా మారింది.
అదే జరిగితే తొలి వ్యక్తి కవితే:
రాజకీయ కుటుంబంలో విభేదాలు తలెత్తడం సహజమే అయినా కవితను పార్టీ నుండి సస్పెండ్ చేస్తే తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో తండ్రి చేత పార్టీ నుంచి సస్పెండ్ కు గురైన తొలి వ్యక్తిగా కవిత నిలవనున్నారు. 2005 లో శివసేన నుచి బాల్ థాక్రే తన అన్న కొడుకు రాజ్ థాక్రేను సస్పెండ్ చేశారు. 2016 లో ములాయం సింగ్ యాదవ్ అఖిలేశ్ యాదవ్ ను సస్పెండ్ చేశారు. ఈ ఏడాది మే నెలలో ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ తన పెద్ద కుమారుడు తేజ్ ప్రతాప్ యాదవ్ ను పార్టీ నుంచి బహిష్కరించారు.
MLC KAVITHA: కవిత కొత్త పార్టీ పేరు ఫిక్స్.. ప్రకటన ఎప్పుడంటే?






