- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అనుకున్నదే అయ్యింది.. బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్
అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్ అధిష్టానం ఎమ్మెల్సీ కవితకు షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: అందరూ ఊహించినట్లే బీఆర్ఎస్(BRS) అధిష్టానం ఎమ్మెల్సీ కవిత(MLC Kavitha)కు షాకిచ్చింది. పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు మంగళవారం అధికారిక ప్రకటన విడుదల చేసింది.
‘పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవలి కాలంలో ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు బీఆర్ఎస్ పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున పార్టీ అధిష్టానం ఈ విషయాన్నీ తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ నేపథ్యంలోనే కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ పార్టీ అధ్యక్షులు కే. చంద్రశేఖర్ రావు నిర్ణయం తీసుకున్నారు’ అని ప్రకటనలో పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే కాళేశ్వరం కేసులో రాష్ట్ర ప్రభుత్వం సీబీఐ ఎంక్వయిరీ వేయడంపై నిన్న కవిత మీడియాతో మాట్లాడారు. కేసీఆర్‌కు మరక అంటించడంలో హరీష్ రావు, సంతోష్‌ల అవినీతే ప్రధాన కారణమని ఆరోపించారు. హరీష్ రావు, సంతోష్ రావుల అవినీతి వల్లే నా తండ్రి కేసీఆర్ చిక్కుకున్నారని అన్నారు. వీరిద్దరి వెనుక ఉండి కుట్రలు చేస్తున్నది ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అని ఆరోపించారు. కేసీఆర్‌పై అభాండాలు వేయడం.. కాళేశ్వరం బూచి చూపి సీబీఐ విచారణకు ప్రయత్నించడం చూసి ఆవేదన కలుగుతోందన్నారు. అంతేకాదు.. గతంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డిపైనా కవిత ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో ఇవాళ ఆమెపై వేటు వేశారు.
Read More..
కేసీఆర్ సంచలన నిర్ణయం.. బీఆర్ఎస్ నుంచి MLC కవిత సస్పెండ్?
MLC KAVITHA: కవిత కొత్త పార్టీ పేరు ఫిక్స్.. ప్రకటన ఎప్పుడంటే?






