- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
MLC KAVITHA: కవిత కొత్త పార్టీ పేరు ఫిక్స్.. ప్రకటన ఎప్పుడంటే?
ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటికే పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది.

దిశ, వెబ్ డెస్క్: ఎమ్మెల్సీ కవిత (mlc kavita) కొత్త పార్టీ పెట్టబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆమె ఇప్పటికే పార్టీ పేరును కూడా రిజిస్ట్రేషన్ చేసినట్టు ప్రచారం జరుగుతోంది. బీసీ అజెండాతో ముందుకు వెళుతున్న కవిత పార్టీ పేరులోనూ తన ఐడియాలజీ ఉండేలా చూసుకున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి (telangana bahujana rastra samiti) పేరును కవిత ఫిక్స్ చేసినట్టు సమాచారం అందుతోంది. మరోవైపు టీఆర్ఎస్ (trs) పేరు సైతం పరిశీలనలో ఉందని, ఇప్పటికే టీఆర్ఎస్‌కు ప్రజల్లో గుర్తింపు ఉండటంతో ఆ పేరు పెడితే జనాల్లోకి వెళ్లడం సులభం అని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
బీఆర్ఎస్ నుండి సస్పెన్షన్ ఆర్డర్స్ వచ్చిన వెంటనే కవిత పార్టీ పేరును ప్రకటిస్తుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నేడో రేపో బీఆర్ఎస్ (brs) నుండి కవితను సస్పెండ్ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఆమె పీఏను సైతం అధికారిక బీఆర్ఎస్ వాట్సాప్ గ్రూపుల నుండి తొలగించగా.. కవిత సస్పెన్షన్ పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫామ్ హౌస్‌లో సీనియర్ నేతలతో చర్చలు జరుపుతున్నారట. ఒకవేళ సస్పెండ్ చేస్తే కవిత పార్టీ పేరును ప్రకటించి, దీపావళికి అధికారికంగా లాంచ్ చేయబోతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం. అదే జరిగితే తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కనున్నాయి.
Kavitha: కవిత ఆరోపణలు.. హరీశ్ కు జై.. సంతోష్ పై పార్టీ సైలెన్స్!.. ఎర్రవల్లిలో ఏం జరుగుతోంది?






