- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Kavitha: ఎమ్మెల్సీ పదవికి కవిత రాజీనామా!.. పార్టీ వేటు నేపథ్యంలో కీలక నిర్ణయం?
బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ కావడంతో కవిత నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేది ఉత్కంఠగా మారింది.

దిశ తెలంగాణ బ్యూరో/డైనమిక్ బ్యూరో : అందరూ ఊహించిందే జరిగింది. పార్టీపై, పార్టీ నేతలపై ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ అధినేత, కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపై వేటు పడింది. పార్టీ లైన్ దాటారని ఆమెను సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ పార్టీ ఇవాళ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల కాలంలో కవిత ప్రవర్తిస్తున్న తీరుతెన్నులు, కొనసాగిస్తున్న పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు పార్టీకి నష్టం కలిగించే రీతిలో ఉన్నందున, అధిష్టానం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిందని పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు కవితను తక్షణం పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి, పార్టీ క్రమశిక్షణ వ్యవహరాల బాధ్యులు సోమ భరత్‌కుమార్, పార్టీ ప్రధాన కార్యదర్శి టి.రవీందర్‌రావు పేరుతో ఇవాళ అధికారిక ప్రకటన వెలువడింది. కవితను సస్పెండ్ చేస్తూ బీఆర్ఎస్ అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో ఆమె అడుగులు ఎటువైపు అనేది ఆసక్తికరంగా మారింది.
బీఆర్ఎస్‌కు పోటీగా సొంత పార్టీ?..
గత కొంతకాలంగా పార్టీ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్న కవిత తనను సస్పెండ్ తన పరిస్థితి ఏంటి అనే విషయంలో మొదటి నుంచి స్పష్టతతో ఉన్నట్లు తెలుస్తోంది. సొంత పార్టీ పెట్టేందుకు ఆమె ఇప్పటికే రంగం సిద్ధం చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ అజెండాతో కార్యక్రమాలు చేస్తున్న కవిత తన పార్టీ పేరులోనూ అదే నినాదం స్ఫురించేలా ‘తెలంగాణ బహుజన రాష్ట్ర సమితి’ పేరును కవిత ఫిక్స్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. అలాగే టీఆర్ఎస్ పేరును సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. టీఆర్ఎస్ పేరుతో కొత్త పార్టీని స్థాపించడం ద్వారా ఇప్పటికే ఆ పేరు ప్రజల్లో మంచి గుర్తింపు ఉండటం, తనను సస్పెండ్ చేసిన బీఆర్ఎస్‌పై రివేంజ్ తీర్చుకునేలా వ్యూహాత్మకంగా కవిత అడుగులు వేయబోతున్నట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్సీ పదవికి రాజీనామా?..
పార్టీ తనపై వేటు వేయడంతో కవిత తన ఎమ్మెల్సీ పదవికి సైతం రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. బీఆర్ఎస్ ద్వారా వచ్చిన పదవిలో ఉంటూ బీఆర్ఎస్‌పై విమర్శలు చేయడం ద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతందని, అందుకే పదవికి రాజీనామా చేసి ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు తెలంగాణ జాగృతి అడుగులు ఎటువైపు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటి వరకు కవిత వెంట నడిచిన జాగృతి శ్రేణులు ఇకపై ఆమె బాటలోనే నడుస్తారా? లేక బీఆర్ఎస్ వైపు నిలుస్తారా? అనేది వేచి చూడాలి.
లిక్కర్ స్కామ్‌లో వాదించి.. నేడు సస్పెండ్ చేసి..
కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ వెలువడిన అధికారిక ప్రకటన అందరినీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ విచారణలో కవిత తరఫున అడ్వొకేట్ సోమ భరత్ వాదనలు వినిపించారు. ఆ సోమ భరత్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి పార్టీ క్రమశిక్షణ వ్యవహరాల బాధ్యుడి హాదాలో కవితను పార్టీ నుండి సస్పెండ్ చేశారు. ఈ పరిణామం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది.
కవితపై వ్యక్తిగత విమర్శలు వద్దు..
అయితే కవితపై పార్టీ చర్యల నేపథ్యంలో వ్యక్తిగతంగా కవిత మీద మాట్లాడొద్దని పార్టీ నుంచి ఆదేశాలు అందినట్లు తెలుస్తోంది. మరికాసేపట్లో బీఆర్ఎస్ మహిళా నేతలు మీడియాతో మాట్లాడబోతున్నారు. కవితపై పార్టీ తీసుకున్న చర్యలపై వారు వివరించబోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీ శ్రేణులు ఎవరు కూడా కవితపై వ్యక్తిగతంగా మాట్లాడకుండా కేవలం ఆమె వల్ల పార్టీకి జరిగిన నష్టం మీదనే మాట్లాడాలని సూచించినట్లు సమాచారం.
Read More..






