72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు

by Malleboina Mahesh |

72వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలకు సీఎం చంద్రబాబు అభినందనలు.. జాతీయ స్థాయిలో తెలుగు సినిమా ప్రతిభ చాటిన అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు!

72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు సీఎం చంద్రబాబు నాయుడు అభినందనలు
X

దిశ, వెబ్ డెస్క్: 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను శనివారం సాయంత్రం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chief Minister Chandrababu Naidu) అభినందనలు తెలిపారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన.. ఈ అవార్డులలో తమ అసాధారణమైన ప్రతిభతో, అద్భుతమైన విజయాలతో జాతీయ స్థాయిలో తెలుగు సినిమా కీర్తిని దశదిశలా చాటి, మనందరికీ గర్వకారణంగా నిలిచిన టాలీవుడ్‌కు చెందిన నటీనటులు, దర్శకులు, నిర్మాతలు మరియు సాంకేతిక నిపుణులకు ఆయన ప్రత్యేకంగా శుభాకాంక్షలు అందజేశారు.

కళ, సంస్కృతి, చలనచిత్ర రంగాలు మన సాంస్కృతిక గుర్తింపునకు, వారసత్వానికి ఎప్పటికీ నిలిచిపోయే బలమైన స్తంభాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా కొనియాడారు. మన తెలుగు చలనచిత్ర రంగం భవిష్యత్తులో కూడా ఇదే విధమైన ప్రతిభను కనబరుస్తూ మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, రాబోయే తరాలకు నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉండాలని ఆయన ఆకాంక్షించారు. అవార్డులు సాధించిన విజేతలందరూ మున్ముందు మరెన్నో విజయాలు అందుకోవాలని, మరిన్ని ఉన్నత పురస్కారాలు సాధించాలని చంద్రబాబు తన సందేశంలో ఆకాంక్షించారు.

Next Story