- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీపై కాంగ్రెస్, బీఆర్ఎస్ లు డ్రామాలు ఆడుతున్నాయని బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి మండిపడ్డారు.

దిశ, డైనమిక్ బ్యూరో: రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య చీకటి ఒప్పందం ఉందని, బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు పార్టీలు యువతు మోసం చేశాయని బీజేఎల్పీ లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి (Alleti Maheshwar Reddy) విమర్శించారు. ఇవాళ నాంపల్లిలోని బీజేపీ స్టేట్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. నిన్నటి బీఆర్ఎస్ యువ సంగ్రామ సదస్సును చూసి ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. తొమ్మిదిన్నరేళ్లు యువతకు బీఆర్ఎస్ ఎన్ని ఉద్యోగాలిచ్చింది? ఈ రెండున్నరేళ్లలో కాంగ్రెస్ ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన ఒకేలా ఉందని ఈ రెండు పార్టీల్లో ఒకరికి అధికార దాహం, మరొకరికి ధన దాహంతో ఉన్నారని ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణ రాష్ట్రాన్ని భ్రష్టుపట్టిస్తున్నారన్నారు. యువత విషయంలో కేటీఆర్ మొసలి కన్నీరు కారుస్తున్నారని, అధికారం కోల్పోయిన బాధను వెల్లిబుచ్చుకుంటున్నాడని విమర్శించారు. రేవంత్ రెడ్డి ఔరంగజేబులా.. కేటీఆర్ ఆదిల్ షాలా వ్యవహరిస్తున్నారని వీరిని ఓడించేందుకు ఛత్రపతి శివాజీలా మోడీ వస్తున్నారన్నారు. నిరుద్యోగ యువతను ఓటు బ్యాంక్ గా చూడవద్దన్నారు.
ఉద్యోగాలు ఇవ్వమంటే ఎండ్రిన్ తాగి చావమంటారా?:
కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి జగన్నాటకం ఆడుతున్నాయని, రెండు పార్టీలు లక్షల కోట్ల అప్పుల ఊబిలోకి ఈ రాష్ట్రాన్ని నెట్టాయన్నారు. 54 వేల కోట్లు సింగరణి బకాయిలు పెట్టారని 12 వేల కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు పెట్టి విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతోందన్నారు. లక్షల కోట్లు అప్పులు తెచ్చి లక్షల కోట్ల బకాయిలు పెట్టిన ఈ రెండు పార్టీలు ఒకరు తిడితే మరొకరు ఏడ్చినట్లు నాటకం ఆడుతున్నాయని దుయ్యబట్టారు. అన్ని వర్గాలను ఈ ప్రభుత్వం మోసం చేసిందన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఫేక్ గాంధీలకు తీసుకువచ్చి డిక్లరేషన్లు ఇప్పించారని ఇప్పుడు ఉద్యోగాలు భర్తీ చేయాలని అడిగితే నిరుద్యోగులపై లాఠీలు ఝుళిపిస్తున్నారని మండిపడ్డారు. 20 వేల పోలీసు ఉద్యోగాలు ఇవ్వమంటే ఎండ్రిన్ తాగి చామంటున్న రేవంత్ రెడ్డికి ఎందుకింత అహంకారం అని ప్రశ్నించారు.






