- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
షాద్‌నగర్ బీసీ బంద్‌లో ఉద్రిక్తత.. కాంగ్రెస్ ఎమ్మెల్యే అరెస్ట్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ బీసీ బంద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెంగుళూరు హైదరాబాద్ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరసనలో పాల్గొన్నారు. భారీగా కాంగ్రెస్ కార్యర్తలు, నాయకులు నిరసనలో పాల్గొనగా ట్రాఫిక్ స్తంభించిపోయింది.

దిశ, వెబ్ డెస్క్: రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ బీసీ బంద్‌లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. బెంగుళూరు హైదరాబాద్ రహదారిపై బైఠాయించి ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ నిరసనలో పాల్గొన్నారు. భారీగా కాంగ్రెస్ కార్యర్తలు, నాయకులు నిరసనలో పాల్గొనగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీంతో పోలీసులు ఎమ్మెల్యేను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు.
ఇక రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. బంద్ నేపథ్యంలో ఉదయం నుండే ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఇతర వ్యాపార, వాణిజ్య సంస్థలు కూడా స్వచ్ఛందంగా బంద్‌కు మద్దతిస్తూ స్వచ్చంగా మూసివేశారు. కేవలం ఒక పార్టీ కాకుండా అన్ని పార్టీలు పోటా పోటీగా ఈ బంద్ లో పాల్గొంటున్నాయి. అక్కడక్కడా చిన్న చిన్న ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నప్పటికీ బంద్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Read More..
జూబ్లీహిల్స్ అభ్యర్థి పై కేసు నమోదు చేసిన పోలీసులు
కుల గణనలో తెలంగాణా దేశానికే ఆదర్శం.. సత్తుపల్లిలో మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్






