కుల గణనలో తెలంగాణా దేశానికే ఆదర్శం.. సత్తుపల్లిలో మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్

by I. Sairam |   (  Updated:2025-10-18 07:22:11  IST  )

భారతదేశం సర్వమత సమ్మేళనం.

కుల గణనలో తెలంగాణా దేశానికే ఆదర్శం.. సత్తుపల్లిలో మంత్రి తుమ్మల సంచలన కామెంట్స్
X

దిశ, సత్తుపల్లి: భారతదేశం సర్వమత సమ్మేళనం. అలాంటి భారతదేశంలో రాజ్యాంగ ఫలాలు అందరికీ దక్కాలంటే రాజ్యాంగ సవరణతో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో ఆనాడు రాహుల్ గాంధీ కన్యాకుమారి టూ కాశ్మీర్ వరకు పాదయాత్రలో హామీ మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో అన్ని కులాలు అన్ని మతాలకు న్యాయం జరిగేలా న్యాయబద్ధంగా రాజ్యాంగం కల్పించిన హక్కులతో తెలంగాణలో ఇంటింటా సర్వే నిర్వహించి బీసీ సర్వే ఆధారంగా 56% జనాభా ఉన్న బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని ఉద్దేశంతో అన్ని రాజకీయ పార్టీల మద్దతుతో క్యాబినెట్ ఆమోదం పొంది గవర్నర్, రాష్ట్రపతి ఆమోదాలకు పంపితే రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాల్సిన గవర్నర్ రాష్ట్రపతి అధికార పార్టీకి మద్దతుగా నిలిచి 42 శాతం రిజర్వేషన్ బీసీ బిల్లును పెండింగ్లో పెట్టి కాలయాపన చేయడం తగదని గుజరాత్‌లో రాజ్యాంగ సవరణ తోనే బీసీ ప్రధానమంత్రిగా బీసీ కానీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బీసీ ప్రధానమంత్రిగా కొనసాగుతున్నారని ఇప్పటికైనా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మనసు మార్చుకుని 56% జనాభా ఉన్న బీసీ బిల్లుకు 42 శాతం రిజర్వేషన్‌తో అన్ని రాజకీయ పార్టీల మద్దతు తెలిపాయి అని లేదంటే ప్రజాక్షేత్రంలో బిజెపికి పరాభవం తప్పదని ఆయన హెచ్చరించారు. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన బీసీ గణన కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలలో కుల గణన చేపట్టాలని నిర్ణయం తీసుకొందని కులగణలతో తెలంగాణ రాష్ట్రం దేశంలో ఆదర్శంగా నిలుస్తుందని ఆయన తెలిపారు. దేశంలో ఉండే విభిన్న జాతులకు విద్య ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే రిజర్వేషన్ అవసరమని ఆయన తెలిపారు. ఈనెల 23వ తేదీన మరోసారి 42 శాతం బీసీ రిజర్వేషన్ పై న్యాయ నిపుణులతో క్యాబినెట్ లో చర్చించి న్యాయపరమైన ఇబ్బందులు లేకుండా అందరి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుంటామని మంత్రి తుమ్మల అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ తప్పకుండా సాధించి తీరుతామని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బిజెపి పార్టీ దొంద వైఖరిని విడనాడాలి.. సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్

కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ రాష్ట్రంలో ఓ లాగా కేంద్రంలో మరో లాగా వ్యవహరించడం తగదని రాష్ట్రంలో ఉన్న బిజెపి నాయకులు 42 శాతం బీసీ రిజర్వేషన్‌కు మద్దతు తెలుపుతూ కేంద్రంలో ఉన్న బిజెపి పార్టీ 42 శాతం రిజర్వేషన్లు అడ్డుకోవడం డబల్ ఇంజన్ సర్కార్ దొంద వైఖరి ఇట్టే అర్థమవుతుందని, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకొని 42 శాతం రిజర్వేషన్ బిల్లును ఆమోదింప చేయాలని ఆమె కోరారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ నాయకులు డాక్టర్ మట్టా దయానంద్ విజయ్ కుమార్, ఖమ్మం జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులు నారాయణ వరకు శ్రీనివాసరావు, అఖిలపక్ష నాయకులు సిపిఐ సిపిఎం ఎమ్మార్పీఎస్ మాల మహానాడు నాయకులు బీసీ రిజర్వేషన్ పై సభను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సిపిఎం మాస్ లైన్, ఎమ్మార్పీఎస్ మాల మహానాడు బీసీ సంఘం, నాయకులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తుమ్మల అభిమానులు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Read More..

‘సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు’.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు

Next Story