- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు’.. ఎంపీ ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు
బస్సులు రొడ్డెక్కలేదు. వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు మూత పడ్డాయి

దిశ, మేడ్చల్ బ్యూరో: బస్సులు రొడ్డెక్కలేదు. వ్యాపార వాణిజ్య, విద్యా సంస్థలు మూత పడ్డాయి. బీసీ సంఘాల పిలుపుతో శనివారం నిర్వహించిన బంద్ కు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించి, బంద్ లో పాల్గొన్నాయి. వెరసి గ్రేటర్ హైదరాబాద్ లో బీసీ బంద్ విజయవంతమైంది. జూబ్లీ బస్టాండ్, ఉప్పల్, హకీంపేట, చెంగిచెర్ల, మేడ్చల్, జీడిమెట్ల, ఈసీఐఎల్ తదితర ఆర్టీసీ డీపోల నుంచి ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. దీంతో నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్, కూకట్ పల్లి, ఉప్పల్, ఈసిఐఎల్ , మేడ్చల్ తదితర ప్రాంతాల్లో బస్ స్టేషన్లు బోసిపోయి కనిపించాయి.
అయితే బీసీ సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా వరంగల్ జాతీయ రహదారిపై టైర్లకు ఆందోళన కారులు నిప్పు పెట్టారు. దీంతో జాతీయ రహదారిపైన కొద్దిసేపు ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఉండేందుకు ఆయా ప్రాంతాల్లో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ పలు ప్రాంతాల్లో తెరిచి ఉన్న షాపులను దగ్గరుండి మూసివేయించి హాల్ చల్ చేశారు.
బీజేపీ కిరికిరి వల్లనే బీసీ రిజర్వేషన్లకు బ్రేక్: కొండా సురేఖ
బీజేపీ కిరికిరి చేయడంవల్లనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రక్రియకు బ్రేక్ పడిందని రాష్ట్ర దేవాదయ, అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బీసీ సంఘాల పిలుపు మేరకు కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ తో కలిసి సికింద్రాబాద్ లోని రేత్ ఫైల్ బస్టాండ్ వద్ద మంత్రి ఆందోళన నిర్వహించారు.స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలు చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం,సీఎం రేవంత్ రెడ్డి చిత్తశుద్దితో ప్రయత్నించారని తెలిపారు. చట్ట సభలో బిల్లు పెట్టి ఆమెందించామని, ఆర్డినెన్స్ జారీ చేశామని తెలిపారు. కానీ బిల్లును ఆపాలనే కుట్రతో కేంద్రానికి పంపారాని సురేఖ ఆరోపించారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ ఇస్తే కోర్టుకు వెళ్లి ప్రభుత్వం ఇచ్చిన జీవోకు అడ్డుపడ్డారని దుయ్యబట్టారు. మళ్లీ బీసీ బంద్ బీజేపీ పాల్గొని డ్రామాలు అడుతుందని ఫైర్ అయ్యారు.
సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి లేదు:ఈటల రాజేందర్
సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన బంద్ లో మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... బీసీ రిజర్వేషన్ అమలు కాదని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో చెప్పారని, బీసీ రిజర్వేషన్లు సాధ్యం కాదని తెలిసి కూడా బీసీలను కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందన్నారు. తమిళనాడు ఒక్కటి మాత్రమే నిజాయితీగా రిజర్వేషన్లు అమలు చేసిందని, పెరియార్ మొదలు అనేక గొప్ప ఉద్యమాలు జరిగాయని గుర్తుచేశారు. 21 మంది రిటైర్డ్ ఐఏఎస్ అధికారులతో రెండేళ్ల పాటు బీసీల ఆర్థిక, సామాజిక, విద్య అన్ని రంగాలపై సమగ్ర సర్వే చేసి.. ఆ రిపోర్ట్ తో రాజ్యాంగంలో 9వ షెడ్యూల్ లో చేర్చారని తెలిపారు.
తెలంగాణలో కూడా కేసీఆర్ ఒక సారి సర్వే చేసి, బీసీ కమిషన్ వేశారని ,నిజాయితీ లేనందున అమలు కాలేదన్నారు.ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పేరుకు కమీషన్లు వేసినా, నిజాయితీ లేదని తప్పుబట్టారు. బీసీలు 52 శాతం ఉంటే 42 శాతం అని కాకి లెక్కలు చెబుతున్నారని, నేను చెప్పేది అబద్ధం అయితే రాజకీయాల నుండి తప్పుకుంటానని ఈటల సవాల్ విసిరారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుండి ఒక్క బీసీ, ఒక ట్రైబల్ ముఖ్యమంత్రి కాలేక పోయారని, ఈ రాష్ట్రంలో బీసీలు 8 మంది మంత్రులుండాలి.. కానీ ముగ్గురే ఉన్నారని, ఉన్నా వారికి ఇచ్చిన మంత్రి శాఖలు కూడా చిన్నవేని ఈటల స్పష్టంచేశారు.
ప్రైవేట్ వాహనాల దందా..
బీసీ బంద్ లో భాగంగా ఆర్టీసీ బస్సులు రొడ్కెక్కకపోవడంతో ప్రైవేటు వాహనాలు అక్రమ వసూళ్ల దందాకు తెరలేపాయి. ఉప్పల్ చౌరస్తా వద్ద వరంగల్ కు వెళ్లే ప్రయాణికుల వద్ద భారీ మొత్తంలో రవాణా చార్జీలు వసూలు చేశాయి. అదేవిధంగా జూబ్లీ బస్టాండ్ వద్ద కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ వైపు వెళ్లే ప్రయాణికుల నుంచి చార్జీల రూపంలో భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడ్డాయి. నగరంలో క్యాబ్ లు, ఆటోలు సైతం రవాణా చార్జీల రూపంలో భారీ వసూళ్లకు పాల్పడినట్లు నగరవాసులు వాపోయారు.
Read More..
న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్
బంద్ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత.. షాపులపై బీసీ సంఘం నేతల దాడులు






