బంద్‌ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత.. షాపులపై బీసీ సంఘం నేతల దాడులు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-18 06:57:20  IST  )

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ సక్సెస్‌ఫుల్‌గా సంపూర్ణంగా కొనసాగుతోంది.

బంద్‌ నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత.. షాపులపై బీసీ సంఘం నేతల దాడులు
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు బీసీ జాయింట్ యాక్షన్ కమిటీ (JAC) రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చిన బంద్ సక్సెస్‌ఫుల్‌గా సంపూర్ణంగా కొనసాగుతోంది. ఈ బీసీ బంద్‌కు రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం, టీజేఎస్, సీపీఐఎంఎల్‌ న్యూడెమోక్రసీ, మావోయిస్టు పార్టీలతో పాటు ఎమ్మార్పీఎస్, మాల మహానాడు, ఆదివాసీ, గిరిజన, మైనార్టీ, విద్యార్థి, ప్రజాసంఘాలు, మేధావులు మద్దతు ప్రకటించారు. అయితే, హైదరాబాద్‌ (Hyderabad)లోని నల్లకుంట (Nallakunta) పరిధిలో బంద్ తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. బంద్‌ను బేఖాతరు చేయకుండా తెరిచి ఉన్న బజాజ్ షో‌ రూంతో పాటు రాఘవేంద్ర టిఫిన్ సెంటర్‌పై ఆందోళనకారులు పెద్ద పెద్ద సిమెంట్ బ్లాక్స్ విసిరారు. దీంతో షోరూం అద్దాలు ధ్వంసమై చెల్లాచెదురుగా పడిపోయాయి. అదేవిధంగా తెరిచి ఉంచిన పెట్రోల్ బంక్‌పై బీసీ సంఘం నాయకులు దాడికి పాల్పడ్డారు. అనంతరం పోట్రోల్ కొట్టే ఫ్యూయల్ మెషిన్లను వారు ధ్వంసం చేశారు. ఈ మేరకు విషయం తెలుసుకున్న లోకల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సద్దుమణిగేలా చేశారు.

Read More..

బీసీ రిజర్వేషన్లపై మాకు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీ‌కి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

న్యాయస్థానాల్లో పోరాటం చేస్తాం.. బీసీ రిజర్వేషన్లపై మంత్రి పొన్నం ప్రభాకర్

Next Story