బీసీ రిజర్వేషన్లపై మాకు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీ‌కి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-18 06:03:38  IST  )

స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది

బీసీ రిజర్వేషన్లపై మాకు ఉన్న చిత్తశుద్ధి ఏ పార్టీ‌కి లేదు.. టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధన కోసం బీసీ సంఘాలు చేపట్టిన రాష్ట్ర వ్యాప్తంగా సంపూర్ణంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) ట్యాంక్‌బండ్ వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి బీసీ బంద్‌కు మద్దతుగా అంబర్‌పేట్‌ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ బంద్‌లో మంత్రులు అందరూ పాల్గొంటున్నారని తెలిపారు. ఉదయం నుంచి అందరితో తాను మానిటరింగ్ చేస్తున్నానని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా బస్సులు ఎక్కడికక్కడే ఆగిపోయాయని తెలిపారు. తాము అడుగుతున్న కోరిక న్యాయమైనది కాబట్టే ప్రజలకు కూడా బంద్‌‌లో స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని తెలిపారు.

బీసీ రిజర్వేషన్ల విషయంలో తమకు ఉన్నంత చిత్తశుద్ధి ఏ పార్టీ‌కి లేదన్నారు. రాష్ట్రంలో శాస్త్రీయంగా కులగణన చేపట్టి బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఇచ్చాయని అన్నారు. దురదృష్టవశాత్తు ఆ జీవోపై స్టే విధించిందని గుర్తు చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి.. బీసీ రిజర్వేషన్ల బిల్లుకు ఆమోదం తెలపాలని విజ్ఞప్తి చేశారు. ఈ విషయంలో తాము త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ప్రధాని నరేంద్ర మోడీని కలుస్తామని అన్నారు. ప్రభుత్వ పరంగా 42 బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలు వెళ్లాలని చూస్తున్నామని.. సాధ్యాసాధ్యాలను పరిశీలించిన తరువాత నిర్ణయం తీసుకుంటామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు.

Read More..

బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్‌కు అస్వస్థత

పదే పదే బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను మోసం చేస్తున్నాయి: కవిత

Next Story