- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీసీ బంద్ ర్యాలీలో వీహెచ్‌కు అస్వస్థత
రాష్ట్రంలో ఉదయం నుండి బీసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు బంద్ లో పాల్గొంటున్నాయి.

X
దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ఉదయం నుండి బీసీ బంద్ కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. దుకాణాలు విద్యాసంస్థలకు సైతం సెలవు ప్రకటించారు. దాదాపు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు బంద్ లో పాల్గొంటున్నాయి. కాంగ్రెస్ పార్టీ సైతం రాష్ట్రవ్యాప్తంగా బీసీ బంద్ లో పాల్గొంటోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నేత వీ. హనుమంతరావు తమ పార్టీ ఎమ్మెల్యే దానం నాగెందర్, డీసీసీ అధ్యక్షుడు రోహిణ్ రెడ్డితో కలిసి అంబర్ పేట్‌లో ర్యాలీ నిర్వహించారు. ఈ క్రమంలో వీహెచ్ నడుస్తూ ఒక్కసారిగా అస్వస్థతకు గురై కిందపడిపోయారు. వెంటనే పక్కన ఉన్న నేతలు ఆయనను పైకి లేపారు. ఇటీవలే వీహెచ్ కిడ్నీ సంబంధిత అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు.
Read More..
బీజేపీ కిరికిరి వల్లే బీసీ రిజర్వేషన్లకు బ్రేక్.. మంత్రి కొండా సురేఖ ఆరోపణలు
Next Story






