- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జూబ్లీహిల్స్ అభ్యర్థి పై కేసు నమోదు చేసిన పోలీసులు
హైదరాబాద్ లోని జూబ్లీహిల్స్ లో ఉప ఎన్నిక హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి.

దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గం (Jubilee Hills Constituency)లో ఉప ఎన్నిక (By-election) హడావిడి కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో పాటు ఎన్నికల ప్రచారం ప్రారంభించాయి. దీంతో పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. మొదటి నుంచి ఎన్నికల ప్రక్రియ తో పాటు ప్రచారంపై ఎన్నికల సంఘం (Election Commission) ప్రత్యేక దృష్టి సారించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెచ్చగొట్టే వ్యాఖ్యలతో పాటు సోషల్ మీడియా పోస్టులపై ఈసీ, పోలీసులు ప్రత్యేక నిఘా పెట్టారు. దీంతో జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పోటీలో నిలిచిన సల్మాన్ ఖాన్ (Salman Khan) చేసిన అనుచిత వ్యాఖ్యలు, పోస్టులపై స్పందించిన పోలీసులు కేసు నమోదు (Case Registered) చేశారు.
ఎన్నికల నిఘా అధికారుల ఫిర్యాదు మేరకు సల్మాన్ ఖాన్ పై బోరబండ పోలీసులు (Borabanda Police) కేసు నమోదు చేశారు. మతపరమైన వ్యాఖ్యలు, సోషల్ మీడియా పోస్టింగ్ లపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు ఈ చర్యలు తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈసీ ఫిర్యాదు (EC complaint) మేరకు సల్మాన్ ఖాన్ పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లు బోరబండ పోలీసులు తెలిపారు. సల్మాన్ వ్యాఖ్యలు, పోస్టులు నగరంలో మత సామరస్యాన్ని దెబ్బతీసే విధంగా ఉన్నట్లు అధికారులు గుర్తించి వాటిని వెంటనే రిమూవ్ చేయాలని తెలిపినట్లు సమాచారం అందుతుంది.






