మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష

by Ratna Kumari |   (  Updated:2026-05-12 11:08:21  IST  )

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి మహబూబ్ నగర్ కోర్టు 3 రోజుల జైలు శిక్ష విధించింది.

మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో వ్యక్తికి 3 రోజుల జైలు శిక్ష
X

దిశ, హన్వాడ : మద్యం సేవించి వాహనం నడిపిన కేసులో ఓ వ్యక్తికి మహబూబ్ నగర్ కోర్టు 3 రోజుల జైలు శిక్ష విధించింది. హన్వాడ ఎస్సై వెంకటేష్ తెలిపిన వివరాల ప్ర‌కారం.. డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో భాగంగా హన్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం నిర్వహించిన తనిఖీల్లో హన్వాడ మండలానికి చెందిన కాట్రావత్ రవి అనే వ్యక్తి పట్టుబడ్డారు. ఇతన్ని మహబూబ్ నగర్ కోర్టులో హాజరు పరచగా.. జడ్జి మూడురోజుల జైలు శిక్ష విధించినట్లు ఎస్సై వెంకటేష్ తెలిపారు. మద్యం తాగి వాహనం నడిపితే జైలు శిక్షతో పాటు భారీ జరిమానా కూడా విధించడం జరుగుతుందని ఆయన తెలిపారు. మద్యం మత్తులో వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజలు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, చాలా వరకు రోడ్డు ప్రమాదాలు మద్యం సేవించి నడపడం వల్లనే జరుగున్నాయని ఎస్సై వెంకటేష్ అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వారి ప్రాణాలు కాకుండాఎదుటి వారి ప్రాణాలకు ముప్పు ఉంటుందని మద్యం సేవించి వాహనాలు నడపొద్దు అని ఎస్సై వెంకటేష్ ప్రజలను కోరారు.

అత్యాచార కేసులో వ్యక్తికి 10 ఏళ్ల కఠిన కారాగార శిక్ష

8 ఏళ్ల చిన్నారి హత్య కేసులో నిందితుడికి ఉరిశిక్ష..

Next Story