తెలంగాణ తలరాతను మార్చిన రోజు : కేటీఆర్ భావోద్వేగ ట్వీట్

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-12-01 15:31:58  IST  )

తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ దీక్ష చేసిన నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు.

తెలంగాణ తలరాతను మార్చిన రోజు : కేటీఆర్ భావోద్వేగ ట్వీట్
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ దీక్ష చేసిన నాటి రోజులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గుర్తు చేసుకున్నారు. కేసీఆర్ ఆమరణ దీక్షకు నేటితో 16 సంవత్సరాలు పూర్తయిందంటూ ఎక్స్ లో భావోద్వేగ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో కరీంనగర్లో కేసీఆర్ అరెస్ట్ అయిన వీడియోను షేర్ చేశారు.

16 సంవత్సరాల క్రితం సరిగ్గా ఇదే రోజున తెలంగాణ తలరాత మారిందని ఆ పోస్ట్ లో పేర్కొన్నారు. ఈ రోజే రాష్ట్ర ఏర్పాటుకు దారితీసిందన్నారు. 2009 నవంబర్ 29 రాష్ట్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. కేసీఆర్ అరెస్ట్ సమయంలో నెలకొన్న పరిస్థితులను ఈ సందర్భంగా ఆయన గుర్తు చేసుకున్నారు.

ప్రత్యేక తెలంగాణ సాధానకై కేసీఆర్ కరీంనగర్లోని అల్గునూర్ వద్ద ఆమరణ నిరాహార దీక్షకు పిలుపునిచ్చారు. అక్కడికి వెళ్తున్న క్రమంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తర్వాత ఉద్యమం మరింత తీవ్రమై.. ఆనాడు కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన చేసేందుకు దారితీసింది. అందుకే ఈరోజును బీఆర్ఎస్ ప్రతి సంవత్సరం దీక్షా దివస్ గా జరుపుకుంటోంది.

Read More... అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కేసీఆర్‌దే.. మాజీ మంత్రి హరీశ్ రావు

కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తి.. ఆ పేరు ప్రస్తావించకుండా కల్వకుంట్ల కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్!

Next Story