కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తి.. ఆ పేరు ప్రస్తావించకుండా కల్వకుంట్ల కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్!

by Jakkula.Mamatha |   (  Updated:2025-11-29 07:04:52  IST  )

కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తి.. ఆ పేరు ప్రస్తావించకుండా కల్వకుంట్ల కవిత ఇంట్రెస్టింగ్ ట్వీట్!
X

దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర సాధనలో అపురూప ఘట్టం ‘‘దీక్షా దివస్‌’’. స్వరాష్ట్ర సాధనే లక్ష్యంగా ‘కేసీఆర్‌ శవయాత్రో.. తెలంగాణ జైత్రయాత్రో’ అని ప్రకటించిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి సరిగ్గా నేటికి 16 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ ఆమరణ దీక్షకు 16 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆసక్తికరమైన ట్వీట్ చేశారు.

తన తండ్రి(కేసీఆర్) పేరును ప్రస్తావించకుండా ‘‘ఒక యోధుని దీక్ష, అమరుల త్యాగం, యావత్ తెలంగాణ జాతిని మేల్కొల్పింది. ఐక్యతా గీతమైంది. స్ఫూర్తిని నింపింది. తెలంగాణ ఉద్యమాన్ని విజయపథం వైపు నడిపింది. రాష్ట్ర సాధనకు దారి దీపమైంది. భౌగోళిక తెలంగాణ సాధించాం, సామాజిక తెలంగాణ సాధిస్తాం. జై తెలంగాణ జై జై తెలంగాణ’’ అని కల్వకుంట్ల కవిత ట్విట్టర్ వేదికగా పేర్కొన్నారు.

Read More... తెలంగాణ తలరాతను మార్చిన రోజు : కేటీఆర్ భావోద్వేగ ట్వీట్

అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన చరిత్ర కేసీఆర్‌దే.. మాజీ మంత్రి హరీశ్ రావు

Next Story