KTR: తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్.. ఏ సమస్యలైనా తీసుకురండి : కేటీఆర్ హామీ

by Ramesh Naini |   (  Updated:2025-09-22 12:55:19  IST  )

ఇప్పటి నుండి ఇది తెలంగాణ భవన్ కాదు.. జనతా గ్యారేజ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భరోసా ఇచ్చారు.

KTR: తెలంగాణ భవన్ ఇప్పుడు జనతా గ్యారేజ్.. ఏ సమస్యలైనా తీసుకురండి : కేటీఆర్ హామీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఇప్పటి నుండి ఇది తెలంగాణ భవన్ (Telangana Bhavan) కాదు.. జనతా గ్యారేజ్ (Janatha Garage) అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) భరోసా ఇచ్చారు. ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడికి రావొచ్చు.. ఇక్కడ న్యాయవాదులు ఉంటారు వాళ్ళకు మీ సలహాలు చెప్పి, సహాయం పొందొచ్చని హామీ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో సోమవారం నల్గొండ, సూర్యాపేట జిల్లా, గజ్వేల్, సంగారెడ్డి నియోజకవర్గాల ఆర్‌ఆర్‌ఆర్ బాధితులు కేటీఆర్‌‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. మా హయంలో మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్లలో భూములు కోల్పోయిన రైతులను కేసీఆర్, మంత్రులు వెళ్ళి కలిసి ఒప్పించారని అన్నారు. రోజులు రోజులు చర్చించి, వారికి ఇల్లు, పరిహారం ఇచ్చి సముదాయించి ఒప్పించామన్నారు. కానీ ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు కూల్చివేతలు జరుగుతున్న దగ్గరికి వెళ్లడానికి మొహం చాటేశారని విమర్శించారు. రీజినల్ రింగ్ రోడ్డు బాధితుల పోరాటానికి మా పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు.

శాస్త్రీయబద్ధంగా (Regional Ring Road) రీజినల్ రింగ్ రోడ్డు అలైన్‌మెంట్ జరిగేదాకా పార్టీ అంతా రైతన్నలకు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ అంశంలో రైతన్నలు ఆత్మస్థైర్యం కోల్పోకుండా ధైర్యంగా ఉండాలి.. ఎవరు ఎలాంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా మానసిక స్తైర్యంతో ఉండాలని విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ పార్టీకి అలైన్‌మెంట్‌లు మార్చి పేదల, రైతుల జీవితాలను ఆగం చేయడం కొత్త కాదని, గతంలో కూడా ఔటర్ రింగ్ రోడ్డు విషయంలో ఇలాగే చేసిందని ఆరోపించారు. గ్రామ గ్రామాన తీర్మానాలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలను బహిష్కరించాలని, ఇలా చేస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ దిగి వస్తాయని, వారి దృష్టికి మీ సమస్య వెళ్తుందని సూచించారు.

Read More..

బతుకమ్మ చీరల మీద ఆమె పేరు, ఫొటో రెండూ ఉండొద్దు.. రేవంత్‌ సర్కార్‌కు కవిత హెచ్చరిక

Kavitha: హీరోయిజం చూపిస్తున్నావా?.. ఎక్కడికి రావాలో చెప్పు నేనే వస్తా: రెచ్చిపోయిన కవిత

Next Story