- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బతుకమ్మ చీరల మీద ఆమె పేరు, ఫొటో రెండూ ఉండొద్దు.. రేవంత్ సర్కార్‌కు కవిత హెచ్చరిక
హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు.

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి(Telangana Jagruti) కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు నిర్వహించారు. మహిళా నాయకులతో కలిసి అధ్యక్షురాలు కవిత(Kalvakuntla Kavitha) బతుకమ్మ పేర్చి, ఆడిపాడారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ప్రపంచంలో ఎక్కడా లేనటువంటి పండుగ మనకుందని అన్నారు. ఇలాంటి పండుగ రోజు ఆడబిడ్డలను ప్రభుత్వం గుర్తించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు ఒకటి కాదు, రెండు చీరలిస్తామని గతంలో చెప్పింది. కానీ మొత్తానికే ఎగ్గొట్టిందని ఎద్దేవా చేశారు. ఆడబిడ్డలను గౌరవించటమంటే కేవలం బతుకమ్మ శుభాకాంక్షలు చెప్పటం కాదు.. ఆడబిడ్డలకు మాట ఇచ్చినట్లు నెలకు రూ.2500 లతో పాటు, 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలందరికీ స్కూటీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా బతుకమ్మ పండుగకు ఇవ్వాల్సిన చీర బతుకమ్మ చీర(Bathukamma Sarees) పేరుతోనే ఇవ్వాలని అన్నారు. ఇందిరమ్మ చీర అని పేరు పెడితే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు.
ఎన్ని ఇబ్బందులున్నా సరే వందల ఏళ్లుగా ఆడబిడ్డలు ఈ పండుగను నిలుపుకుంటూ వచ్చారు.. గాజులరామారంలో హైడ్రా ఇళ్లను కూల్చేసిన సందర్భంగా నిరసనగా ఆడబిడ్డలు అక్కడే బతుకమ్మ ఆడారు.. ఎంత కష్టమైనా, సంతోషమైనా సరే ఈ పండుగను నిలబెట్టుకోవాలని ఆడబిడ్డలను కోరారు. జాగృతి తరపున ఇప్పటికే 110 బతుకమ్మ పాటలను విడుదల చేసినట్లు తెలిపారు. తాజాగా సింగర్ మంగ్లీ చేత పాడించిన మరో పాటను ఈ సందర్భంగా విడుదల చేసినట్లు చెప్పారు. మాట్ల తిరుపతి రచించిన పాట మంగ్లీ పాడగా ఎస్ కే మదీన్ సంగీతం అందించారని వెల్లడించారు. బతుకమ్మ పండుగను నిలబెట్టేందుకు జాగృతి తరఫున నిరంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉంటుందని అన్నారు.
Read More..
Kavitha: హీరోయిజం చూపిస్తున్నావా?.. ఎక్కడికి రావాలో చెప్పు నేనే వస్తా: రెచ్చిపోయిన కవిత






