పాతబస్తీలో విషాదం.. ఇంటర్ విద్యార్థి దారుణ హత్య

by Jakkula.Mamatha |   (  Updated:2026-07-19 04:52:59  IST  )

హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

పాతబస్తీలో విషాదం.. ఇంటర్ విద్యార్థి దారుణ హత్య
X

దిశ,చంపాపేట్: హైదరాబాద్ పాతబస్తీలో దారుణ ఘటన చోటుచేసుకుంది. కాలాపత్తర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థిని గుర్తుతెలియని దుండగులు అత్యంత కిరాతకంగా హత్య చేయడంతో ప్రాంతంలో తీవ్ర కలకలం నెలకొంది. స్థానికుల సమాచారం మేరకు.. ఘటనా స్థలానికి చేరుకున్న కాలాపత్తర్ పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు.

మృతుడి పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులు, వ్యక్తిగత లేదా ఇతర విభేదాలు ఏమైనా కారణమా అనే అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సంఘటన జరిగిన ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలు పరిశీలిస్తూ, ప్రత్యక్ష సాక్షుల వాంగ్మూలాలు నమోదు చేస్తున్నారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకునేందుకు ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు సమాచారం. పండగ రోజున యువ విద్యార్థి హత్యకు గురికావడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ ఘటనతో కాలాపత్తర్ పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, హత్య వెనుక ఉన్న అసలు కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికానున్నాయి.

Next Story