- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కేసీఆర్ సభ వేళ హుటాహుటీన ఢిల్లీకి హరీశ్ రావు
జగిత్యాలలో కేసీఆర్ సభ జరుగుతున్న వేళ, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హుటాహుటీన ఢిల్లీకి వెళ్లడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పాలిటిక్స్ ఇవాళ హాట్ హాట్ గా కొనసాగుతున్నాయి. ఉమ్మడి కరీంనగర్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ పోటాపోటీ సభలు సర్వత్రా ఆసక్తి రేపుతున్న వేళ మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. జగిత్యాలలో బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా బహిరంగ సభ నిర్వహిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ కీలక నేత హరీశ్ రావు హుటాహుటిన ఢిల్లీకి పయనమైన వెళ్లారు. ఆయనతో పాటు కేసీఆర్‍కు అత్యంత సన్నిహితుడు వినోద్ రావు సైతం హస్తినాకు వెళ్లారు. కేసీఆర్ సభ వేళ కీలక నేతలు ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్‍గా మారింది.
అందుకోసమేనా?:
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవకతవకలపై విచారణ నిమిత్తం ఏర్పాటైన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదికను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌లపై హైకోర్టు ఎల్లుండి (ఏప్రిల్ 22) తీర్పు వెల్లడించాల్సి ఉంది. అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే సుప్రీంలో పిటిషన్ వేసే ఆలోచనలో బీఆర్ఎస్ ఉందని ఈ నేపథ్యంలో లాయార్లతో భేటీ అయి చర్చించడం కోసం హరీశ్ రావు ఢిల్లీకి వెళ్లారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. నిజానికి ఈ తీర్పును హైకోర్టు ఏప్రిల్ 8న వెల్లడించాల్సి ఉంది. కానీ గత విచారణలో తీర్పును ఎల్లుండికి కోర్టు వాయిదా వేసింది.






