ఏ ముఖం పెట్టుకుని అధికారంలోకి వస్తామంటున్నారు?.. బీఆర్ఎస్‍పై తుమ్మల ఫైర్

by Prasad Jukanti |   (  Updated:2026-04-20 08:07:15  IST  )

పదవి పోయిన ఆందోళనలోనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మండిపడ్డారు.

ఏ ముఖం పెట్టుకుని అధికారంలోకి వస్తామంటున్నారు?.. బీఆర్ఎస్‍పై తుమ్మల ఫైర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పదవి పోయిన ఆందోళన, ఆక్రోశం బీఆర్ఎస్ నేతల్లో ఉందని అందుకే కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు అమలు చేయడం లేదని స్టీరియో రికార్డు వినిపిస్తున్నామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు విమర్శించారు. ఆరోపణలతో బీఆర్ఎస్ నేతల బతుకు బజారుపాలవుతుందని, గత అవినీతి వల్లే బీఆర్ఎస్ అస్థిత్వం, స్థానం, అధికారం పోయింది ఏ ముఖం పెట్టుకుని మళ్లీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారని మండిపడ్డారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. సీతారామ పథకం నాతో పాటు ఖమ్మం జిల్లా ప్రజలకు ఆకాంక్ష అని నేను టీడీపీలో ఉన్నప్పుడే దుమ్ముగూడెం ప్రాజెక్టు డిజైన్ చేశారని, వైఎస్సార్ హయాంలో ఇందిరా సాగర్-రాజీవ్ సాగర్ పనులు చేపట్టినట్లు వెల్లడించారు. వైఎస్సార్ మరణానంతరం ఇందిరా సాగర్-రాజీవ్ సాగర్ పథకానికి తిలోదకాలు దిద్దారన్నారు. తెలంగాణ ఏర్పడ్డాక నా ప్రధాన కోరిక సీతారామ ప్రాజెక్టు అని చెప్పానన్నారు. బీఆర్ఎస్ పార్టీ సిగ్గులేకుండా సీతారామ ప్రాజెక్టు గురించి మాట్లాడుతోందని మండిపడ్డారు.

‘కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?’.. హరీష్ రావు పై మంత్రి తుమ్మల ఫైర్

Next Story