బీఆర్ఎస్‍లో వర్గపోరు!.. హరీశ్ రావు ఎపిసోడ్‍పై కాంగ్రెస్ ఎటాక్

by Prasad Jukanti |   (  Updated:2026-04-20 12:33:48  IST  )

హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై కాంగ్రెస్ ఎటాక్ చేస్తోంది. ఈ పరిణామంపై కేసీఆర్ స్పందించాలని మంత్రులు డిమాండ్ చేశారు.

బీఆర్ఎస్‍లో వర్గపోరు!.. హరీశ్ రావు ఎపిసోడ్‍పై కాంగ్రెస్ ఎటాక్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కేసీఆర్ జగిత్యాల సభ వేళ మాజీ మంత్రి హరీశ్ రావు ఢిల్లీ పర్యటన రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. దాదాపు ఏడాది తర్వాత బహిరంగ సభకు పార్టీ అధినేత వస్తున్న సమయంలో హరీశ్ రావు హుటాహుటీన హస్తిన బాట పట్టడం ఇటు బీఆర్ఎస్ శ్రేణులతో పాటు పొలిటికల్ కారిడార్‍లో రకరకాల ఉహాగానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ లోని పరిణామాలపై కాంగ్రెస్ ఎటాక్ మొదలు పెట్టింది. హరీశ్ రావు ఢిల్లీ పర్యటనపై తాజాగా స్పందించిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్ బీఆర్ఎస్‍లో వర్గపోరు మొదలైందని ఆరోపించారు. హరీశ్ రావు ఢిల్లీ పర్యటన వెనుక ఆంతర్యం ఏంటో జగిత్యాల సభలో కేసీఆర్, కేటీఆర్ ప్రకటించాలన్నారు. ఇక మరో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రియాక్ట్ అవుతూ హరీశ్ రావు రాజకీయ జీవితం ప్రమాదంలో ఉందని కామెంట్ చేశారు.

బీజేపీ వైపు హరీశ్ రావు చూపు!:

ఈ అంశంపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ స్పందిస్తూ సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. జీవన్ రెడ్డి రాకతో బీఆర్ఎస్‍లో ముసలం మొదలైందని హరీశ్ రావుతో పాటు బీజేపీ వైపు ఎమ్మల్యేలు చూస్తున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్ రావు ఢిల్లీ వెళ్లిందే బీజేపీ నేతలను కలవడానికి అని హాట్ కామెంట్స్ చేశారు. రాష్ట్రంలోని రాజకీయ పరిణామాల దృష్ట్యా హరీశ్ రావు త్వరలో బీజేపీ గూటికి చేరబోతున్నారని చాలా కాలంగా ప్రచారం జరుగుతున్న వేళ సంజయ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఆసక్తిగా మారాయి.

బీఆర్ఎస్ రియాక్ట్:

అయితే హరీశ్ రావు పర్యటనపై బీఆర్ఎస్ స్పందించింది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకే పార్టీ త్రిసభ్య కమిటీ ఢిల్లీ పర్యటనకు వెళ్లిందని ప్రకటన విడుదల చేసింది. ఈ ప్రతినిధుల బృందంలో హరీశ్ రావు, మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర ఉన్నారని ఏప్రిల్ 22వ తేదీన తెలంగాణ హైకోర్టులో కాళేశ్వరం కమిషన్‌పై వెలువడనున్న తుది తీర్పు, అలాగే ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసుల నేపథ్యంలో తదుపరి న్యాయపరమైన కార్యాచరణను సిద్ధం చేసేందుకు వీరు ఢిల్లీ వెళ్లారని స్పష్టం చేసింది. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో ఈ కమిటీ ప్రత్యేకంగా సమావేశమైందని కాళేశ్వరం కమిషన్ పై హైకోర్టు తీర్పు వచ్చిన తర్వాత సుప్రీంకోర్టును ఆశ్రయించే అవకాశాలపై, అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసులో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి చర్యలపై లాయర్లతో చర్చించనున్నట్లు పార్టీ కేంద్ర కార్యాలయం వెల్లడించింది.

కేసీఆర్ సభ వేళ హుటాహుటీన ఢిల్లీకి హరీశ్ రావు

Next Story