- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
KCR:సిట్ విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగం!
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు ముందు కేసీఆర్ ఎమోషనల్ అయినట్లు తెలుస్తోంది.

దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో (Phone Tapping Case) సిట్ (SIT) విచారణ ఇప్పుడు కేసీఆర్ (KCR) వంతు వచ్చింది. ఇవాళ నందినగర్ లోని కేసీఆర్ నివాసంలో ఆయనను సిట్ అధికారులు ప్రశ్నిస్తు్నారు. ఈ విచారణ కోసం ఆదివారం ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ కు చేరుకున్నారు. అనంతరం మధ్యాహ్నం భోజన సమయంలో కేసీఆర్ భావోద్వేగానికి లోనైనట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఊపిరిపోసి, ఉద్యమ రచన చేసిన గదిలోనే విచారణ ఎదురుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదని కేసీఆర్ అన్నట్లు తెలుస్తోంది. ఇప్పుుడ ఏ గదిలో అయితే విచారణ ఎదుర్కొంటున్నానో అదే గదిలో తాను రాష్ట్ర సాధన కోసం ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపానని, ఇదే గదిలో ఎంతో మందితో చర్చలు జరిపానని చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వ్యూహ రచన చేసిన గదిలోనే ఇప్పుడు ఇదే గదిలో విచారణ ఎదుర్కోవడం దురదృష్టకరం అని ఆయన ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.






