BREAKING: ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ.. ఏం అడిగారు? ఏం చెప్పారు?

by Naga Rani Yarlagadda |   (  Updated:2026-02-01 15:10:49  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది.

BREAKING: ముగిసిన కేసీఆర్ సిట్ విచారణ.. ఏం అడిగారు? ఏం చెప్పారు?
X

దిశ, వెబ్‌డెస్క్: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సిట్ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని నందినగర్ లో ఉన్న నివాసంలో రెండవ అంతస్తులోని ఓ గదిలో ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు సిట్ విచారణ ప్రారంభమవ్వగా.. నాలుగు గంటల 50 నిమిషాలపాటు సిట్ అధికారులు కేసీఆర్ ను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకూ సిట్ అధికారులు సేకరించిన ఆధారాలను కేసీఆర్ ముందు ఉంచి విచారించినట్లు తెలుస్తోంది. ఇప్పటి వరకూ విచారణ చేసినవారి స్టేట్మెంట్ల ఆధారంగా కేసీఆర్ ను సిట్ అధికారులు విచారించారు. ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న ఆ పెద్దాయన మీరేనా? అని సిట్ అధికారులు కేసీఆర్ ను ప్రశ్నించినట్లు సమాచారం.

మాధాపూర్ డీసీపీ రీతిరాజ్, ఐపీఎస్ విజయ్ కుమార్, ఐపీఎస్ నారాయణరెడ్డి, అడిషనల్ ఎస్పీలు అరవింద్ కుమార్, కేఎస్ రావు కేసీఆర్ ను ప్రశ్నించారు. ఆయన చెప్పిన విషయాలన్నింటినీ సిట్ అధికారులు రికార్డు చేసుకున్నారు. గతవారంలో హరీష్ రావు, ఆ తర్వాత కేటీఆర్ లను కూడా సిట్ విచారించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నెక్స్ట్ సిట్ నోటీసులు ఎవరికి ఇవ్వనుందోనని ఆసక్తి నెలకొంది. కేసీఆర్ విచారణ మొదలైనప్పటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర నిరసనలు చేశారు. ఈ క్రమంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ వద్ద పలుమార్లు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సీఎం డౌన్ డౌన్ అంటూ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేయడం, సీఎం నివాసాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో సీఎం రేవంత్ రెడ్డి నివాసం వద్ద పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Read More : KCR:సిట్ విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగం!

Next Story