Phone tapping case: మొదలైన కేసీఆర్ సిట్ విచారణ.. గులాబీ బాస్‍పై సంధిస్తున్న ప్రశ్నలు ఇవే?

by Prasad Jukanti |   (  Updated:2026-02-01 11:21:40  IST  )

ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్ విచారమ మొదలైంది.

Phone tapping case: మొదలైన కేసీఆర్ సిట్ విచారణ.. గులాబీ బాస్‍పై సంధిస్తున్న ప్రశ్నలు ఇవే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ ప్రారంభమైంది. సిట్ నోటీసుల నేపథ్యంలో ఇవాళ ఉదయం ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ నందినగర్ నివాసానికి వచ్చిన కేసీఆర్ కు కేటీఆర్ స్వాగతం పలికారు. అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభమైంది. మాదాపూర్‌ డీసీపీ రీతిరాజ్‌, ఐపీఎస్‌ విజయ్‌కుమార్‌, ఐపీఎస్‌ నారాయణరెడ్డి, అడిషనల్‌ ఎస్పీలు అరవింద్‌ కుమార్‌, కేఎస్‌ రావు కేసీఆర్ ను ప్రశ్నిస్తున్నారు. విచారణకు ముందే కేసీఆర్ నివాసానికి చేరుకున్న సిట్ అధికారులు బిల్డింగ్ లోని రెండో అంతస్తులో ఒక గదిలో విచారణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. విచారణ సమయంలో కేసీఆర్ వెంట ఒకరు ఉండేందుకు అవకాశం ఉంది. దీంతో గులాబీ బాస్ వెంట మాజీ ఎంపీ సంతోశ్ రావు ఉంటారని బీఆర్ఎస్ లీగల్ టీమ్ సిట్ కు సమాచారం అందజేసింది. ఇక విచారణ సమయంలో కుటుంబ సభ్యుడిగా కేటీఆర్ ఇంట్లోనే ఉండనున్నారు. హరీశ్ రావు సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నేతలు అంతా తెలంగాణ భవన్ లోనే ఉన్నారు.

డాక్యుమెంట్స్ తో వచ్చిన గులాబీ బాస్:

అంతకు ముందు ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి వచ్చిన కేసీఆర్ తన వెంట ఒక నోట్ బుక్, పలు డాక్యుమెంట్లు తెచ్చుకున్నారు. సిట్ అడిగే ప్రశ్నలను ఆయన నోట్ చేసుకోబోతున్నారని తెలుస్తోంది. ఇక తన వెంట తెచ్చిన డాక్యుమెంట్లలో ఏముందనేది ఉత్కంఠగా మారింది. విచారణను సిట్ అధికారులు వీడియో రికార్డు చేయనున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటికే పలువురు అధికారులతో పాటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ నేతలు, కేసీఆర్ కుటుంబ సభ్యులైన కేటీఆర్, హరీశ్ రావు, సంతోశ్ రావును సిట్ ప్రశ్నించింది. ఇప్పుడు కేసీఆర్ ను విచారణకు పిలవడంతో గులాబీ బాస్ పై సిట్ ఎలాంటి ప్రశ్నలు గుప్పించబోతోంది అనేది ఉత్కంఠగా మారింది. అధికారులు, పార్టీ నేతల నుంచి స్టేట్ మెంట్ రికార్డు చేసిన నేపథ్యంలో వారిచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేసీఆర్ ను సిట్ అధికారులు ప్రశ్నించబోతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ ఆదేశాల వెనుక ఉన్నది ఎవరు? ప్రభాకర్ రావు నియామకం విషయంలో మీ పాత్ర ఏంటి అనే అంశాలపై సిట్ ప్రశ్నల వర్షం కురిపించబోతున్నట్లు తెలుస్తోంది. గత ప్రభుత్వాధినేతగా ఉన్న కేసీఆర్ విచారణతో ఈ ఫోన్ ట్యాపింగ్ దర్యాప్తు ఏ మలుపు తిరగబోతోందో చూడాలి మరి.

MORE NEWS : KCR:సిట్ విచారణకు ముందు కేసీఆర్ భావోద్వేగం!

Next Story