- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హరీశ్ రావు తండ్రి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత
తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణ (Satyanarayana) ఈ రోజు ఉదయం కన్నుమూశారు.

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు (Harish Rao) తండ్రి సత్యనారాయణ (Satyanarayana) ఈ రోజు ఉదయం కన్నుమూశారు. దీంతో హరీశ్ రావు నివాసంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ విషాద వర్తను తెలుసుకున్న మాజీ సీఎం కేసీఆర్, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) తన్నీరు సత్యనారాయణ మరణం పట్ల సంతాపం తెలిపారు. ఇందులో భాగంగానే మాజీ ఎంపీ, జాగృతి వ్యవస్థాపకురాలు అయిన కవిత (Kavitha).. హరీశ్ రావు తండ్రి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎక్స్ వేదికగా ఆమె స్పందిస్తూ.. ఆమె తన ట్వీట్‌లో "మాజీ మంత్రి హరీశ్ రావు గారి తండ్రి సత్యనారాయణ రావు గారి మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. హరీశ్ రావు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను." అని రాసుకొచ్చారు. ఇదిలా ఉంటే హరీశ్ రావు తండ్రి మరణవార్త తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు పెద్ద ఎత్తున ఆయన నివాసానికి చేరుకొని నివాళులు అర్పిస్తున్నారు.
Read More..
హరీష్‌రావుకు పితృ వియోగం.. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ సంతాపం
మినిస్టర్స్ పనితీరుపై ప్రోగ్రెస్ రిపోర్ట్..! హైకమాండ్‌కు అందజేసిన సీఎం రేవంత్‌రెడ్డి






