హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం.. తండ్రి సత్యనారాయణ కన్నుమూత

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-28 02:54:13  IST  )

మాజీమంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్ రావు ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది.

హరీశ్‌రావు ఇంట తీవ్ర విషాదం.. తండ్రి సత్యనారాయణ కన్నుమూత
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ముఖ్య నేత హరీశ్‌రావు (Harish Rao) ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆయన తండ్రి తన్నీరు సత్యనారాయణ (Satyanarayana)కన్నుమూశారు. వయోభారం సమస్యలతో ఇవాళ తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు. అయితే, సత్యనారాయణ స్వగ్రామం కరీంనగర్ (Karimnagar) జిల్లా కొత్తపల్లి. ఈ సందర్భంగా హరీశ్‌రావు తండ్రి మృతి పట్ల మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR), మాజీ మంత్రి కేటీఆర్ (KTR), బీఆర్ఎస్ ముఖ్య నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇతర పార్టీల నేతలు, రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. అయితే, హైదరాబాద్‌ కోకాపేట్‌లోని హరీశ్‌రావు స్వగృహం క్రిన్స్‌ విల్లాస్‌లో సత్యనారాయణ పార్థివ దేహాన్ని సందర్శనార్థం ఉంచారు. మరోవైపు సత్యనారాయణ భౌతికకాయానికి నివాళులర్పించేందుకు పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు హరీష్‌రావు ఇంటికి ఒక్కొక్కరుగా చేరుకుంటున్నారు.

Read More..

హరీష్‌రావుకు పితృ వియోగం.. సీఎం రేవంత్‌రెడ్డి, స్పీకర్ సంతాపం

హరీశ్ రావు తండ్రి మృతిపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కవిత


Next Story