‘రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం కోసం కేసీఆర్ రావాలి’:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

by Jakkula.Mamatha |   (  Updated:2026-04-09 10:35:40  IST  )

కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

‘రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం కోసం కేసీఆర్ రావాలి’:మాజీ మంత్రి జీవన్ రెడ్డి
X

దిశ, జగిత్యాల ప్రతినిధి: కాంగ్రెస్ పార్టీకి గుడ్‌బై చెప్పిన మాజీ మంత్రి, సీనియర్ నాయకుడు జీవన్ రెడ్డి.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం జరగాలంటే మళ్లీ కేసీఆర్ రావాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. గత రెండు సంవత్సరాల్లో తెలంగాణ ప్రజలు చాలా కోల్పోయారని, మరో మూడు సంవత్సరాల్లో జరిగే నష్టాన్ని నివారించాలంటే బీఆర్‌ఎస్ నాయకత్వం అవసరమని అభిప్రాయపడ్డారు. కాంగ్రెస్ పాలనలో బడుగు, బలహీన వర్గాలకు ఎలాంటి ప్రయోజనం కలగలేదని విమర్శించిన జీవన్ రెడ్డి.. రైతు సంక్షేమ పథకాలు పూర్తిగా కనుమరుగయ్యాయని అన్నారు.

రైతు భరోసా, కేసీఆర్ కిట్, గొర్ల పంపిణీ, చేప పిల్లల పంపిణీ వంటి పథకాలు నిలిచిపోయాయని తెలిపారు.రైతుల సమస్యలను పట్టించుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని, ముఖ్యంగా ప్రాజెక్టుల విషయంలో పూర్తిగా నిర్లక్ష్యం చూపుతోందని ఆరోపించారు. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అమలు కాలేదని, ఇంకా 20 నుంచి 30 శాతం మంది రైతులకు మాఫీ జరగలేదని వెల్లడించారు.

నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందని, ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలు కూడా సరిగా అమలు కావడం లేదని మండిపడ్డారు.ఈ నేపథ్యంలో నేడు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ కానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నెల 27న జరిగే బీఆర్‌ఎస్ ప్లీనరీలో మాజీ సీఎం కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు.ఈ పరిణామాలు తెలంగాణ రాజకీయాల్లో పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి.

జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. పలువురు జర్నలిస్టులకు గాయాలు

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి!.. స్వయంగా ఆహ్వానించిన కేటీఆర్..

Next Story