జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. పలువురు జర్నలిస్టులకు గాయాలు

by Prasad Jukanti |   (  Updated:2026-04-09 10:34:51  IST  )

జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ పర్యటనలో జరిగిన తోపులాటలో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి.

జీవన్ రెడ్డి ఇంటి వద్ద ఉద్రిక్తత.. పలువురు జర్నలిస్టులకు గాయాలు
X

దిశ, జగిత్యాల/డైనమిక్ బ్యూరో: జగిత్యాలలో (Jagtial) మాజీ మంత్రి జీవన్ రెడ్డి (Jeevan Reddy) ఇంటి వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈ ఘటనలో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఇవాళ పార్టీలోకి ఆహ్వానించేందుకు జీవన్ రెడ్డి ఇంటికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) వెళ్లారు. కేటీఆర్ వెంట మాజీ మంత్రులు గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు వచ్చారు. దాంతో ఒక్కసారిగా కార్యకర్తలు దూసుకురావడంతో అక్కడ తీవ్ర తోపులాట జరిగింది. ఈక్రమంలో కార్యకర్తలు మీడియా ప్రతినిధులపై పడిపోయారు. ఈ ఘటనలో పలువుకు జర్నలిస్టులకు గాయాలు కాగా ఎలక్ట్రానిక్ మీడియాకు సంబంధించి కెమెరాలు ధ్వంసం అయ్యారు. ఈ ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధులు ఈ కార్యక్రమాన్ని బైకాట్ చేశారు.

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి!.. స్వయంగా ఆహ్వానించిన కేటీఆర్..

బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి!.. స్వయంగా ఆహ్వానించిన కేటీఆర్..

‘రాష్ట్ర భవిష్యత్తు పునర్నిర్మాణం కోసం కేసీఆర్ రావాలి’:మాజీ మంత్రి జీవన్ రెడ్డి

Next Story