అసోసియేషన్ ముసుగులో అక్రమాలు.. 20 ఏళ్లుగా ఒకే చోట విధులు

by Mahesh |
అసోసియేషన్ ముసుగులో అక్రమాలు.. 20 ఏళ్లుగా ఒకే చోట విధులు
X

దిశ, తెలంగాణ బ్యూరో: వైద్యారోగ్యశాఖలో అసోసియేషన్ ముసుగులో కొంత మంది వైద్యులు అక్రమాలకు పాల్పడుతున్నారని డాక్టర్ శేఖర్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని వివిధ బోధనా ఆస్పత్రిలో ఒకే చోట 20 ఏళ్లుగా విధులు నిర్వహిస్తూ, ఆయా ఆసుపత్రులను గుప్పిట్లో పెట్టుకుంటున్నారని మండిపడ్డారు. ఏళ్ల తరబడి ఒకే చోట పాతుకు పోయిన వైద్యులను బదిలీ చేయాలని గత ప్రభుత్వానికి అనేక సార్లు రిక్వెస్ట్ చేశామని కానీ పట్టించుకోలేదన్నారు. ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం ఏళ్ల తరబడి ఒకే చోట విధులు నిర్వర్తిస్తున్న వైద్యులను ట్రాన్స్ ఫర్ చేయాల్సిన అవసరం ఉందని వివరించారు. ఈ మేరకు డాక్టర్ శేఖర్ బృందం శనివారం డీఎంఈ కి ఫిర్యాదు చేశారు.

ఈ సందర్భంగా డాక్టర్ శేఖర్ మాట్లాడుతూ.. బదిలీలు కావాల్సి ఉన్నా, కొందరు వైద్యులు అసోసియేషన్ ముసుగులో తిష్ట వేశారన్నారు. ఒకే చోట విధులు నిర్వర్తించడం తో ఆగడాలు మితిమీరి పోతున్నాయన్నారు. ఇదే అంశంపై హెల్త్ మినిస్టర్, సెక్రటరీకి కూడా ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు. ఇక ఆరోగ్య శాఖలో సాధారణ బదిలీలు జరగకపోవడంతో మిగతా వైద్యులకు అన్యాయం జరుగుతుందన్నారు. చాలా మంది డాక్టర్లు తీవ్ర మనోవేదనకు గురవుతున్నట్లు తెలిపారు. మరోవైపు గత ప్రభుత్వంలో విడుదల చేసిన జీవో నెంబర్ 48 ను వెంటనే రద్దు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్లు, చంద్రశేఖర్, సాంబశివ రెడ్డి, సూర్యనారాయణ, బెంజమెన్, మూశాఖాన్, అజామ్, జగతి, అరుణ, కవిత ,శకుంతల, అమరావతి, ఎం కవిత,హేమలత తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed