- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
IPL effect : ఉప్పల్‌లో 3 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్.. మెట్రో స్టేషన్, బస్టాప్‌ల వద్ద రద్దీ
ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ముగియడంతో పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది.

దిశ, డైనమిక్ బ్యూరో: ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ ముగియడంతో పరిసర ప్రాంతాల్లో భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మ్యాచ్ అనంతరం అభిమానులు ఒక్కసారిగా బయటకు రావడంతో నాగోల్ నుంచి హబ్సిగూడ వెళ్లే మార్గంలో దాదాపు 3 కిలోమీటర్ల మేర వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. తిరుగు ప్రయాణం కోసం జనం పోటెత్తడంతో మెట్రో స్టేషన్లు, బస్టాప్‌ల వద్ద తీవ్ర రద్దీ నెలకొంది.
లక్నో ఉత్కంఠ విజయం..
మరోవైపు, ఈ హోరాహోరీ పోరులో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై లక్నో సూపర్ జెయింట్స్ ఉత్కంఠ విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి రాణించడంతో లక్నో ముందు 157 పరుగుల లక్ష్యం నమోదైంది. ఛేదనలో మార్క్రమ్ పోరాట పటిమ కనబర్చగా, లక్నో కెప్టెన్ రిషబ్ పంత్ ఒత్తిడిని అధిగమించి తన అద్భుత ఇన్నింగ్స్‌తో జట్టును విజయతీరాలకు చేర్చాడు. హైదరాబాద్ బౌలర్లు లక్నో బ్యాటర్లను కట్టడి చేయడంలో విఫలమవడంతో సొంతగడ్డపై, సొంత ప్రేక్షకుల మధ్య సన్‌రైజర్స్‌కు నిరాశే మిగిలింది.






