- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
హైదరాబాద్ కోటలో లక్నో జయభేరి.. కెప్టెన్ ఇన్నింగ్స్‌తో అదరగొట్టిన పంత్
సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన హోరాహోరీ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది.

దిశ, వెబ్‌డెస్క్: సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఉప్పల్ స్టేడియంలో జరిగిన హోరాహోరీ పోరులో లక్నో సూపర్ జెయింట్స్ విజయం సాధించింది. చివరి ఓవర్ వరకు అత్యంత ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో, కెప్టెన్ రిషబ్ పంత్ తనదైన శైలిలో బ్యాటింగ్‌తో జట్టును గెలిపించి, సొంత ప్రేక్షకుల మధ్య హైదరాబాద్‌ను ఓడించి లక్నోకు కీలకమైన విజయాన్ని అందించారు. 157 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లక్నో సూపర్ జెయింట్స్, ఒక దశలో ఒత్తిడిలో పడినా కెప్టెన్ రిషబ్ పంత్ అద్భుతమైన ఇన్నింగ్స్‌తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చేశారు. మైదానం నలుమూలలా షాట్లతో విరుచుకుపడిన పంత్, ఒత్తిడిని అధిగమించి జట్టును విజయతీరాలకు చేర్చారు. మరోవైపు, మార్కరమ్ కూడా అద్భుతమైన పోరాట పటిమను కనబరిచారు.
సొంత గడ్డపై హైదరాబాద్‌కు నిరాశ...
సొంత ప్రేక్షకుల మద్దతు ఉన్నప్పటికీ, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ మ్యాచ్‌లో విజయాన్ని అందుకోలేకపోయింది. క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి తొలి ఇన్నింగ్స్‌లో జట్టును ఆదుకున్నా, లక్నో బ్యాటర్లను కట్టడి చేయడంలో హైదరాబాద్ బౌలర్లు విఫలమయ్యారు. ఈ విజయంతో లక్నో పాయింట్ల పట్టికలో తన స్థానాన్ని మరింత మెరుగుపరుచు






