- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, స్పోర్ట్స్ : సన్‌రైజర్స్ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. ఐపీఎల్-2026లో భాగంగా లక్నో సూపర్ జెయింట్స్‌తో మ్యాచ్ జరుగుతుంది. ఈ మ్యాచ్‌లో అభిషేక్ డకౌటయ్యాడు. రెండు బంతులే ఆడి పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. దీంతో అభిషేక్ తన పేరిట చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు. టీ20ల్లో ఈ ఏడాదిలో అతను డకౌట్ అవడం ఇది 6వసారి కావడం గమనార్హం. ఓ క్యాలెండర్ ఇయర్‌లో టీ20ల్లో అత్యధికసార్లు డకౌటైన భారత ఆటగాడిగా నిలిచాడు. 2018లో రోహిత్ శర్మ, 2024లో సంజూ శాంసన్ కూడా ఆరు సార్లు డకౌటయ్యారు. తాజాగా అభిషేక్ వారి సరసన చేరాడు. ఈ మ్యాచ్‌కు ముందు జనవరిలో న్యూజిలాండ్‌తో సిరీస్‌లో రెండు సార్లు పరుగుల ఖాతా తెరవలేదు. ఇక టీ20 ప్రపంచకప్‌లోనూ అతని పేలవ ఫామ్ కొనసాగింది. తొలి మూడు మ్యాచ్‌ల్లోనే డకౌటైన విషయం తెలిసిందే. ప్రపంచకప్‌లో 8 ఇన్నింగ్స్‌ల్లో కేవలం 141 రన్సే చేశాడు.






