- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
SRH vs LSG : మ్యాచ్‌కి ముందు ఉప్పల్ స్టేడియం వద్ద గందరగోళం
ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు విధించిన కఠిన ఆంక్షలు అభిమానులను తీవ్ర గందరగోళానికి గురి చేశాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: ఐపీఎల్ 2026లో భాగంగా ఉప్పల్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్‌కు విధించిన కఠిన ఆంక్షలు అభిమానులను తీవ్ర గందరగోళానికి గురి చేశాయి. పర్సులు, స్మార్ట్ వాచ్‌లు, బ్లూటూత్ డివైజ్‌లను అనుమతించకపోవడంతో ఆదివారం మ్యాచ్‌ను చూడడానికి వచ్చిన అభిమానులు తీవ్ర ఆసహనం వ్యక్తం చేశారు. దీంతో కాసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.
కాగా, ఉప్పల్ స్టేడియంలో సెల్ఫీ స్టిక్స్, ఇయర్‌బడ్స్, పవర్ బ్యాంకులు, లాప్‌టాప్‌లు, కెమెరాలు, వాటర్ బాటిళ్లు, బయటి ఆహారం, సిగరెట్లు, హెల్మెట్ తదితర వస్తువులపై పోలీసులు నిషేధం విధించిన విషయం తెలిసిందే. వాటిని తీసుకొస్తే లోపలికి అనుమతి లేదని ముందే స్పష్టం చేశారు. ఇక స్టేడియం వద్ద రాచకొండ పోలీసులు 2,000 మంది సిబ్బందితో పటిష్ట భద్రత, 430 సీసీటీవీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు.
Read more.. IPL effect : ఉప్పల్‌లో 3 కి.మీ మేర స్తంభించిన ట్రాఫిక్.. మెట్రో స్టేషన్, బస్టాప్‌ల వద్ద రద్దీ
Next Story






