- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కోటి రూపాయలు ఇచ్చినట్లు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా.. సీఎంకు హరీశ్‌రావు సంచలన సవాల్
'సిగాచి' ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. కోటి పరిహారం ఇస్తే.. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సంచలన సవాల్ విసిరారు.

దిశ, వెబ్‌డెస్క్: 'సిగాచి' ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబాలకు సీఎం రేవంత్ రెడ్డి రూ. కోటి పరిహారం ఇచ్చినట్లు నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని హరీశ్‌రావు సంచలన సవాల్ విసిరారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన ఇస్నాపూర్‌లో మాట్లాడుతూ.. సిగాచి కంపెనీలో ఏకంగా 54 మంది ప్రాణాలు కోల్పోతే ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదని హరీశ్ రావు ధ్వజమెత్తారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం ప్రకటిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు చిల్లిగవ్వ కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేవలం సిగాచీ కంపెనీ మాత్రమే మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం ఇచ్చిందని తెలిపారు. హామీల పేరుతో ప్రజలకు ద్రోహం చేసిన కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఇక కేంద్రంలో ఉన్న బీజేపీ పేదల వ్యతిరేక పార్టీ అని మండిపడ్డారు. రెండేళ్ల తర్వాత మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేది కేసీఆరేనని ఆయన జోస్యం చెప్పారు. రేవంత్ రెడ్డివి వట్టి మాటలేనని, చేతలు మాత్రం లేవని హరీశ్‌రావు సెటైర్లు వేశారు.






