పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం చూస్తున్నాం.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత బిగ్ స్టేట్‌మెంట్

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 08:16:09  IST  )

మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి అయ్యే అవకాశం ఉందని, అందుకు మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు.

పార్టీ ఆవిర్భావానికి ముహూర్తం చూస్తున్నాం.. తెలంగాణ జాగృతి చీఫ్ కవిత బిగ్ స్టేట్‌మెంట్
X

దిశ, వెబ్‌డెస్క్: మూడు నెలల్లో పార్టీ ఏర్పాటు ప్రక్రియను పూర్తి అయ్యే అవకాశం ఉందని, అందుకు మంచి ముహూర్తం కోసం చూస్తున్నామని తెలంగాణ జాగృతి చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఇవాళ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియా సమావేశం అనంతరం ఆమె చిట్‌చాట్ చేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ చేయమని ఆదేశాలిచ్చిన పెద్ద చేపను వదిలేసి.. ప్రణీత్ రావు లాంటి చిన్న చేపను సిట్ అధికారులు పట్టుకున్నారని కామెంట్ చేశారు. సిట్ దర్యాప్తు అనంతరం ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్న డీఎస్పీ ప్రణీత్ రావును ప్రభుత్వం డిమోట్ చేసిందని అన్నారు. కానీ కేసులో చిన్న చేపలను పట్టుకుని పెద్ద చేపలను వదిలేస్తున్నారని, కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని కామెంట్ చేశారు.

తెలంగాణ చరిత్రలో కేసీఆర్‌కు ఒక పుస్తకం ఉటుందని కవిత అన్నారు. ఆయనను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదన్నారు. తెలంగాణలో రాజకీయ విమర్శలు ఒక లైన్ దాటి తీవ్ర స్థాయికి చేరుకుంటున్నాయని అన్నారు. ఒక జాతిని, నాయకులను అవమానించే వ్యాఖ్యలు హర్షించదగినవి కావని ఫైర్ అయ్యారు. ప్రజలు పార్టీల వ్యవహారాన్ని గమనించి ప్రశ్నించే నాయకులు, సీపీఎం, స్వతంత్రులకు మద్దతు ఇవ్వాలని వాదనలు వినిపిస్తున్నాయని తెలిపారు.

బీసీ సబ్ ప్లాన్, హామీల అమలు వైఫల్యం

కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు ఏటా రూ.20 వేల కోట్లు కేటాయిస్తామని, బీసీ సబ్ ప్లాన్‌ను చట్టబద్ధం చేస్తామని హామీ ఇచ్చిందని కవిత అన్నారు. అయితే, గత రెండు బడ్జెట్లలో ఈ హామీ పూర్తిగా అమలు కాలేదని ఆరోపించారు. 2025-26 బడ్జెట్‌లో బీసీ సంక్షేమ శాఖకు కేటాయింపులు పెరిగినప్పటికీ, జనాభా నిష్పత్తి ప్రకారం రూ.20 వేల కోట్ల హామీకి దూరంగా ఉంది. బీసీ మేధావులు, సంఘాలు ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ తరహాలోనే చట్టబద్ధ బీసీ సబ్ ప్లాన్ డిమాండ్ చేస్తున్నాయని అన్నారు. త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లో ఈ అంశంపై కసరత్తు చేయాలని, హామీలను సవరించుకోవాలని విమర్శలు వినిపిస్తున్నాయని తెలిపారు.

తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ

ఈనెల 12న ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నారని తెలిపారు. బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత కార్యక్రమానికి పిలుపునిచ్చారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు పెద్ద ఎత్తున హాజరు కావాలని కోరారు. తెలంగాణ ఉద్యమ చరిత్రను గౌరవించడం, ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం ఈ సభ లక్ష్యమని కవిత పేర్కొన్నారు.


స్పీకర్ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలి.. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు

Next Story