స్పీకర్ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలి.. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు

by Kema Shiva Kumar |   (  Updated:2026-02-06 08:17:03  IST  )

ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.

స్పీకర్ పాజిటివ్‌గా నిర్ణయం తీసుకోవాలి.. ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు
X

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసులో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై, ఇవాళ జస్టిస్ అగస్టీన్ జార్జ్ మసీహ్, జస్టిస్ సంజయ్ కరోల్‌తో కూడిన సుప్రీం కోర్టు (Supreme Court) ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణీత కాలంలో నిర్ణయం తీసుకోవాలని గతంలోనే సూచించింది. అయితే, విచారణ ప్రారంభం కాగానే ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ (Abhishek Manu Singhvi) తన వాదనలు వినిపించారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్ ఇప్పటికే విచారణ జరుపుతున్నట్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ మేరకు తమకు మూడు వారాల సమయం కావాలని సింఘ్వీ కోర్టును అభ్యర్థించారు. అనంతరం ధర్మాసనం కేసు తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది. నిర్ణీత గడువు తర్వాత కూడా స్పీకర్ తన నిర్ణయాన్ని ప్రకటించని పక్షంలో, దానిని కోర్టు ధిక్కరణగా పరిగణించాల్సి వస్తుందని ధర్మాసనం పేర్కొంది.

ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. కాసేపట్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ

Next Story