- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు.. కాసేపట్లో సుప్రీంకోర్టులో కీలక విచారణ
ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్యే ఫిరాయింపు కేసులో తెలంగాణ (Telangana) అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ (Prasad Kumar) తీసుకున్న నిర్ణయాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను ఇవాళ జస్టిస్ అగస్టీన్ జార్జ్, జస్టిస్ సంజయ్ కరోల్ సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించనుంది. గత విచారణలో స్పీకర్‌కు రెండు వారాల గడువు ఇచ్చిన కోర్టు ఇవాళ తుది నివేదికను సమర్పించాలని ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్‌లో చేరినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న 10 మంది ఎమ్మెల్యేలలో ఇప్పటికే 8 మందికి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ (Clean Chit) ఇచ్చారు. వారిలో అరెకపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, టి.ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్ రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్య, సంజయ్ కుమార్ ఉన్నారు. సదరు ఎమ్మెల్యేలు పార్టీ మారినట్లుగా సరైన ఆధారాలు లేవని, వారు ఇప్పటికీ బీఆర్ఎస్ సభ్యులుగానే ఉన్నారని స్పీకర్ తన నిర్ణయాన్ని అధికారికంగా వెల్లడించారు.
ఇదే చివరి అవకాశమని స్పీకర్‌కు హెచ్చరిక..
జనవరి 16న జరిగిన విచారణలో సుప్రీంకోర్టు (Supreme Court) స్పీకర్‌కు ఇదే చివరి అవకాశం అని హెచ్చరించింది. రెండు వారాల్లోగా నిర్ణయం తీసుకోకపోతే ఎమ్మెల్యేల అనర్హతపై తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. మరోవైపు పార్టీ మారిన 8 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్‌చిట్ ఇవ్వడం రాజ్యాంగ విరుద్ధమని, బహిరంగంగా కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నా ఆధారాలు లేవనడం హాస్యాస్పదమని బీఆర్ఎస్ నేతలు కేటీఆర్, పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. అయితే, నేటి విచారణలో ఎమ్మెల్యేల అనర్హతపై కోర్టు ఏం వ్యాఖ్యలు చేస్తుందోనని అటు బీఆర్ఎస్ నేతల్లోనూ.. ఇటు కాంగ్రెస్ శ్రేణుల్లోనూ ఉత్కంఠ నెలకొంది.






